పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో తెలియడం లేదు
పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి జీవనాడి అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో తెలియడం లేదన్నారు.

పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి జీవనాడి అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో తెలియడం లేదన్నారు.
పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి జీవనాడి అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. పోలవరం ప్రాజెక్టును 71 శాతం పూర్తి చేశామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో తెలియడం లేదన్నారు. బుధవారం (నవంబర్ 20, 2019) పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రివర్స్ టెండరింగ్ పేరుతో అడ్డగోలుగా ముందుకెళ్లారని మండిపడ్డారు. పోలవరం పూర్తి అయితే మూడో పంటకు నీరందుతుందని చెప్పారు.
అమరావతి రాజధాని పరిస్థితిని గందరగోళంలో పడేశారని విమర్శించారు. అమరావతిపై ఇప్పుడు కమిటీలు ఎందుకు వేశారని ప్రశ్నించారు. ఇప్పటికీ రాష్ట్రంలో ఇసుక దొరకడం లేదన్నారు. సంపద సృష్టించకుంటే రాష్ట్ర ఆదాయం ఎలా పెరుగుతుందని ప్రశ్నించారు.
ఇల్లు అలకగానే పండగ కాదన్నారు. వైసీపీ అనుకున్నంత మాత్రాన తమ ప్రతిపక్ష హోదా పోదన్నారు. సంక్షోభాన్ని ఎదుర్కొన్న ప్రతీసారి టీడీపీ బలోపేతమైందని గుర్తు చేశారు. వైసీపీ నిర్ణయాలతో రాష్ట్రం దారుణంగా నష్టపోతుందన్నారు.