మళ్లీ బాలయ్యకు టికెట్

  • Published By: madhu ,Published On : March 7, 2019 / 04:00 PM IST
మళ్లీ బాలయ్యకు టికెట్

సినీ నటుడు బాలకృష్ణ 2019 అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలవబోతున్నారు. గత కొద్ది రోజులుగా పార్లమెంట్ నియోజకవర్గ అసెంబ్లీ స్థానాలకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు ఖరారు చేస్తున్న సంగతి తెలిసిందే. టికెట్ ఖరారులో బాబు ఎన్నో సమీకరణాలను బేరీజు వేసుకుంటున్నారు. జిల్లాల వారీగా అభ్యర్థుల ఖరారులో బాబు అధ్యయనం చేస్తూ టికెట్లు కేటాయిస్తున్నారు. తాజాగా మార్చి 07వ తేదీ గురువారం సాయంత్రం పలువురికి టికెట్ కన్ఫామ్ చేశారు. 
Also Read : నా కొడుకు లోకేష్ మీద ఒట్టు : లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ 2

తాడేపల్లిగూడెం నుండి ఈలి నాని పేరును ఖరారు చేశారు. టికెట్ రేసులో బాపిరాజు ఉన్నా కుల సమీకరణాల కారణంగా నాని వైపు బాబు మొగ్గు చూపారు. తాడేపల్లి గూడెం స్థానాన్ని గెలిపించే బాధ్యత మాత్రం బాపిరాజుకే అప్పగించారు బాబు. 

ఇక హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో కూడా అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. హిందూపురం టీడీపీ ఎంపీ అభ్యర్థిగా నిమ్మల కిష్టప్ప, ఇక్కడి అసెంబ్లీ ప్లేస్ను సినీ నటుడు బాలకృష్ణకు కేటాయించారు. పెనుగొండ – పార్థసారధి, ధర్మవరం – వరదాపురం సూరి, మడకశిర – వీరన్న, రాప్తాడు – పరిటాల సునీత పేర్లను ఖరారు చేశారు. పుట్టపర్తి నుండి పల్లె రఘునాథ రెడ్డి వైపు బాబు మొగ్గు చూపుతున్నారు. ఇక కదిరి నియోజకవర్గం స్థానాన్ని పెండింగ్‌లో ఉంచారు. ఇక్కడి నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే చాంద్ పాషా, మాజీ ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ రేసులో ఉన్నారు.
Also Read : అద్బుతం జరిగింది : 118 ఏళ్ల బామ్మకు గుండె ఆపరేషన్