మూడు రాజధానులపై ఆర్డినెన్స్ : సీఎం జగన్ సంచలన నిర్ణయం
ఏపీ సీఎం జగన్ మూడు రాజధానులపై పట్టుదలగా ఉన్నారు. ఇప్పటికే శాసనసభలో సక్సెస్ అయ్యారు. మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు బిల్లులకి శాసనసభ ఏకీగ్రీవంగా ఆమోదం

ఏపీ సీఎం జగన్ మూడు రాజధానులపై పట్టుదలగా ఉన్నారు. ఇప్పటికే శాసనసభలో సక్సెస్ అయ్యారు. మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు బిల్లులకి శాసనసభ ఏకీగ్రీవంగా ఆమోదం
ఏపీ సీఎం జగన్ మూడు రాజధానులపై పట్టుదలగా ఉన్నారు. ఇప్పటికే శాసనసభలో సక్సెస్ అయ్యారు. మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు బిల్లులకి శాసనసభ ఏకీగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఇప్పుడు శాసనమండలి వంతు వచ్చింది. అయితే మండలిలో టీడీపీ సంఖ్యా బలం ఎక్కువ, వైసీపీ బలం తక్కువ. దీంతో మండలిలో ఏం జరగనుంది? మండలిలో బిల్లులను ప్రభుత్వం ఏ విధంగా నెగ్గించుకుంటుంది? అనేది అనేది హాట్ టాపిక్ గా మారింది. అటు అధికార పక్షం, ఇటు ప్రతిపక్షం.. వ్యూహ ప్రతివ్యూహాలతో సిద్ధమయ్యాయి.
శాసనమండలిలో బిల్లుల ఆమోదానికి జగన్ ప్రభుత్వం వ్యూహాలు సిద్ధం చేసింది. సభ టీడీపీ చేతుల్లోకి వెళ్లకుండా అధికార పార్టీ ఎత్తుగడలు వేసింది. వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను మండలి ఆమోదించినా.. తిరస్కరించినా.. ఈ రోజే జరిగిపోయేలా సీఎం జగన్ వ్యూహ రచన చేశారు. ఇందులో భాగమే ఆర్డినెన్స్ యోచన. ఆర్డినెన్స్ తెచ్చైనా.. బిల్లులను అమలు చేయాలనే పట్టుదలతో సీఎం జగన్ ఉన్నారు. ఆర్డినెన్స్ తెస్తే.. 6 నెలల్లో చట్టంగా మారి అమల్లోకి వస్తుందనేది జగన్ స్ట్రాటజీ.
మరోవైపు ముడు రాజధానుల బిల్లుని అడ్డుకునేందుకు టీడీపీ అన్ని రకాలుగా కసరత్తు చేస్తోంది. పూర్తి స్థాయిలో చర్చకు పట్టుపట్టాలని నిర్ణయించింది. ప్రతీ సభ్యుడికి బిల్లుపై మాట్లాడే అవకాశం ఇవ్వాలంటోంది. ఎమ్మెల్సీలంతా సభకు హాజరయ్యేలా చంద్రబాబు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలని టీడీపీ డిమాండ్ చేయనుంది. అలా సెలెక్ట్ కమిటీకి పంపడం వల్ల బిల్లును పెండింగ్ లో పెట్టొచ్చనే వ్యూహాంలో చంద్రబాబు ఉన్నారు. చంద్రబాబుకి ఎత్తుకి జగన్ పైఎత్తు వేశారు. ఆర్డినెన్స్ అస్త్రం ప్రయోగించాలని సీఎం జగన్ డిసైడ్ అయినట్టు వార్తలు వస్తున్నాయి.
* మండలి ముందుకు వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులు
* మండలిలో కీలక బిల్లుల ఆమోదంపై ఉత్కంఠ
* వ్యూహ, ప్రతివ్యూహాలతో సిద్ధమైన అధికార, విపక్షాలు
* శాసనమండలిలో సంఖ్యాపరంగా టీడీపీదే ఆధిక్యం
* బిల్లులను అడ్డుకుని తీరతామంటున్న టీడీపీ
* బిల్లులను ఆమోదింప చేసుకుంటామని ప్రభుత్వం ధీమా
* మండలిలో టీడీపీకి సంఖ్యా బలం(34) ఎక్కువ, వైసీపీకి(9) తక్కువ
* మండలిలో ఏం జరుగుతుందోనని ఉత్కంఠ
* బిల్లుని అడ్డుకునేందుకు అన్ని రకాలుగా టీడీపీ కసరత్తు
* పూర్తి స్థాయిలో చర్చకు పట్టుపట్టనున్న టీడీపీ
* ప్రతీ సభ్యుడికి బిల్లుపై మాట్లాడే అవకాశం ఇవ్వాలంటున్న టీడీపీ
* ఎమ్మెల్సీలంతా సభకు హాజరయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్న చంద్రబాబు
* బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలంటున్న ప్రతిపక్ష టీడీపీ
* సెలెక్ట్ కమిటీకి పంపడం వల్ల బిల్లును పెండింగ్ లో పెట్టొచ్చనే వ్యూహం
* టీడీపీకి చెక్ పెట్టేలా జగన్ వ్యూహం
* మండలికి పెద్ద ఎత్తున రానున్న మంత్రులు
* టీడీపీ చేతుల్లోకి సభ వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోనున్న మంత్రులు
* బిల్లు ఆమోదానికి వ్యూహాలు సిద్ధం చేసిన జగన్ ప్రభుత్వం
* సభ టీడీపీ చేతుల్లోకి వెళ్లకుండా అధికార పార్టీ ఎత్తుగడలు
* బిల్లులను ఆమోదించినా.. తిరస్కరించినా.. ఈ రోజే జరిగిపోయేలా వ్యూహ రచన
* ఆర్డినెన్స్ తెచ్చైనా బిల్లులను అమలు చేయాలనే యోచనలో ప్రభుత్వం
* ఆర్డినెన్స్ తెస్తే 6 నెలల్లో అమలు
* మండలి సమావేశాలు జరిగే తీరుపై ఉత్కంఠ
మండలిలో టీడీపీ వ్యూహాలు:
ప్లాన్ 1: బిల్లులను మండలిలో తిరస్కరించడం
ప్లాన్ 2: బిల్లులను రెండోసారి ప్రవేశపెడితే తిరస్కరించకుండా సెలెక్ట్ కమిటీకి పంపడం
ప్లాన్ 3: బిల్లులను మొదటిసారే సెలెక్ట్ కమిటీకి పంపడం
మండలిలో బలాబలాలు :
మొత్తం ఎమ్మెల్సీలు : 58
టీడీపీ-28
వైసీపీ-9
పీడీఎఫ్-5
స్వతంత్రులు 3
నామినేటేడ్ 8
బీజేపీ-2
ఖాళీలు-3
ఏపీ శాసనమండలి పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. పాలనా వికేంద్రీకరణపై చర్చకు ముందే నెంబర్ గేమ్ మొదలైంది. 58మంది సభ్యులున్న పెద్దల సభలో సంఖ్యాపరంగా ప్రతిపక్షానిదే(టీడీపీ) ఆధిపత్యం. టీడీపీకి 28మంది సభ్యులు ఉండగా… అధికార పక్షం వైసీపీకి కేవలం 9మంది సభ్యులే ఉన్నారు. ఇక.. బీజేపీకి ఇద్దరు సభ్యులుండగా… ముగ్గురు ఇండిపెండెంట్లు, 8మంది నామినేటెడ్ సభ్యులు, ఐదుగురు పీడీఎఫ్ ఎమ్మెల్సీలున్నారు. మరో మూడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి.
టీడీపీకి 28మంది సభ్యులతోపాటు.. నామినేటెడ్ సభ్యుల్లోని ఐదుగురు ఎమ్మెల్సీలు, ఇండిపెండెంట్లలోని ఓ ఎమ్మెల్సీ టీడీపీకి మద్దతిస్తున్నారు. దీంతో మొత్తంగా ఆ పార్టీ బలం 34గా ఉంది. ఇక గవర్నర్ కోటాలో నామినేట్ అయిన కంతేటి సత్యనారాయణరాజు వైసీపీలోనే ఉండటంతో ప్రభుత్వ బలం 10కి చేరింది. నామినేటెడ్ సభ్యుల్లో ఒకరు, ఇండిపెండెంట్లలోను ఇద్దరు సభ్యులు ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేసే అవకాశం లేకపోలేదు.
అయితే.. వీరంతా కలిపినా వైసీపీకి 14మంది సభ్యుల బలం మాత్రమే దక్కుతోంది. కానీ… బిల్లును గట్టెక్కించాలంటే అధికార పక్షానికి మరో ఆరుగురు ఎమ్మెల్సీలు అవసరం. పీడీఎఫ్ ఎమ్మెల్సీలు ఐదుగురున్నా వారికి పార్టీలతో సంబంధం లేదు. అందుకే వీరు తటస్థంగా ఉండే అవకాశం ఉంది. ఈ క్రమంలో బిల్లుల ఆమోదంపై అనుమానాలు నెలకొన్నాయి.