సింగపూర్ కాదు సౌతాఫ్రికా మోడల్ : చంద్రబాబుకి బిగ్ షాక్ ఇచ్చిన సీఎం జగన్
ఏపీ అసెంబ్లీలో రాజధాని గురించి సీఎం జగన్ సంచలన ప్రకటన చేశారు. ఏపీకి 3 రాజధానులు రావొచ్చేమో అని జగన్ చెప్పారు. ఏపీకి మూడు రాజధానులు అవసరం అన్న సీఎం.. 3

ఏపీ అసెంబ్లీలో రాజధాని గురించి సీఎం జగన్ సంచలన ప్రకటన చేశారు. ఏపీకి 3 రాజధానులు రావొచ్చేమో అని జగన్ చెప్పారు. ఏపీకి మూడు రాజధానులు అవసరం అన్న సీఎం.. 3
ఏపీ అసెంబ్లీలో రాజధాని గురించి సీఎం జగన్ సంచలన ప్రకటన చేశారు. ఏపీకి 3 రాజధానులు రావొచ్చేమో అని జగన్ చెప్పారు. ఏపీకి మూడు రాజధానులు అవసరం అన్న సీఎం.. 3 కేపిటల్స్ నిర్మించే ఆలోచనలో ఉన్నామన్నారు. అమరావతిలో లెజిస్లేటివ్(చట్టసభలు) కేపిటల్, విశాఖలో ఎగ్జిక్యూటివ్(సచివాలయం) కేపిటల్, కర్నూలులో జ్యుడీషియల్(హైకోర్టు) కేపిటిల్ పెట్టొచ్చు అన్నారు. పరిపాలన వికేంద్రీకరణ జరగాల్సిన అవసరం ఉందని సీఎం జగన్ తేల్చి చెప్పారు. ఈ క్రమంలో సీఎం జగన్.. దక్షిణాఫ్రికా మోడల్ గురించి అసెంబ్లీలో ప్రస్తావించారు. దక్షిణాఫ్రికాకు మూడు రాజధానులు ఉన్నాయని జగన్ గుర్తు చేశారు. మరి.. ఏపీకి మూడు రాజధానులు ఉంటే తప్పేంటి అని జగన్ ప్రశ్నించారు.
రాష్ట్రానికి మూడు రాజధానులు రావొచ్చేమో అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లోనే కాదు ప్రజల్లోనూ సంచలనంగా మారాయి. అంతా దీని గురించే చర్చించుకుంటున్నారు. కాగా, దక్షిణాఫ్రికా మోడల్ అంటూ సీఎం జగన్ చేసిన ప్రకటన ఆసక్తికరంగా మారింది. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు సింగపూర్ మోడల్ గురించి పదే పదే ప్రస్తావించారు. ఏపీని సింగపూర్ తరహాలో డెవలప్ చేస్తామని చంద్రబాబు చెప్పారు. సింగపూర్ ప్రభుత్వంతో, అక్కడి కంపెనీలతో అనేక ఒప్పందాలు కూడా చేసుకున్నారు. అమరావతి మాస్టర్ ప్లాన్ కూడా సింగపూర్ వారితోనే చేయించారు. దీంతో సింగపూర్ మోడల్ బాగా పాపులర్ అయ్యింది.
కట్ చేస్తే.. సీన్ మారిపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. బంపర్ మెజార్టీతో వైసీపీ పవర్ లోకి వచ్చింది. జగన్ సీఎం అయ్యారు. అంతే.. ఒక్కసారిగా ఏపీ రాజధాని గురించి పెద్ద డిస్కషన్ నడిచింది. రాజధానిని అమరావతి నుంచి తరలిస్తారు అనే వార్తలు జోరుగా వినిపించాయి. రాజధానిగా అమరావతి అనువైన ప్రాంతం కాదని మంత్రులు చేసిన వ్యాఖ్యలు, సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలు రాజధాని తరలింపు వాదానికి బలాన్ని ఇచ్చాయి. ఈ పరిస్థితుల్లో మూడు రాజధానులు రావొచ్చేమో అంటూ జగన్ చేసిన ప్రకటన హాట్ టాపిక్ గా మారింది. ఏపీలో ఇప్పుడు అంతా దీని గురించే చర్చ జరుగుతోంది.
కాగా, చంద్రబాబు సింగపూర్ గురించి పదే పదే ప్రస్తావిస్తే.. ఇప్పుడు సీఎంగా ఉన్న జగన్ ఏమో..సౌతాఫ్రికా మోడల్ ని తెరపైకి తెచ్చారు. దక్షిణాఫ్రికాకి మూడు రాజధానులు ఉన్న విషయాన్ని గుర్తు చేసిన జగన్.. ఏపీకి 3 రాజధానులు ఉంటే తప్పేముందన్నారు. పరిపాలన, అభివృద్ది వికేంద్రీకరణ.. పాలనా సౌలభ్యం కోసం మూడు చోట్ల రాజధానులు ఏర్పాటు చేయడంలో తప్పు లేదన్నారు. జగన్ సీఎం అయ్యాక.. సింగపూర్ ప్రభుత్వంతో, ఆ దేశ కంపెనీలతో ఉన్న రిలేషన్స్ ను కట్ చేశారు. ఒప్పందాలన్ని రద్దు చేసుకున్నారు. అసలు సింగపూర్ అనే పదమే వినిపించకుండా చేశారు. ఇలా చంద్రబాబుకి అనేక షాకులిచ్చారు జగన్. ఇప్పుడేమో ఏకంగా సౌతాఫ్రికా మోడల్ పేరు చెప్పి.. చంద్రబాబుకి బిగ్ షాక్ ఇచ్చారు సీఎం జగన్.
* అసెంబ్లీలో సీఎం జగన్ సంచలన ప్రకటన
* ఏపీకి 3 రాజధానులు అవసరం
* ఏపీకి 3 రాజధానులు రావొచ్చు
* అమరావతిలో లెజిస్లేటివ్(చట్టసభలు) క్యాపిటల్
* విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్
* కర్నూలులో హైకోర్టు, జ్యూడీషియల్ క్యాపిటల్
* అధికారులంతా విశాఖ నుంచే పని చేయొచ్చు
* ఒక రాష్ట్రానికి 3 రాజధానులు ఉంటే తప్పేంటి
* దక్షిణాఫ్రికాకు మూడు రాజధానులు ఉన్నాయి
* మనం కూడా మారాలి
* పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల్సిన అవసరం ఉంది
* ఏపీలో సౌతాఫ్రికా మోడల్