Delhi Liquor Scam: ఆప్ నేత సంజయ్ సింగ్‌కు ఐదు రోజుల ఈడీ రిమాండ్ విధించిన కోర్టు

ఈడీ తరపు న్యాయవాది దినేష్ అరోరా వాదనలు వినిపిస్తూ.. రెండు వేర్వేరు లావాదేవీలు జరిగాయని కోర్టులో పేర్కొన్నారు. ఇందులో మొత్తం రూ.2 కోట్ల లావాదేవీలు జరిగాయని అన్నారు

Delhi Liquor Scam: ఆప్ నేత సంజయ్ సింగ్‌కు ఐదు రోజుల ఈడీ రిమాండ్ విధించిన కోర్టు

Updated On : October 5, 2023 / 6:35 PM IST

Delhi Liquor Scam: ఆమ్ ఆద్మీ పార్టీ నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్‌ను రోస్ అవెన్యూ కోర్టు గురువారం ఈడీ రిమాండ్‌కు పంపింది. వాస్తవానికి ఈడీ పది రోజుల రిమాండ్ కోరగా, కోర్టు ఐదు రోజుల రిమాండ్ ఇచ్చింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో నార్త్ అవెన్యూలోని ఆయన అధికారిక నివాసంలో చాలా గంటల పాటు సోదాలు, విచారణల తర్వాత బుధవారం ఈడీ అరెస్టు చేసింది. కొంతమంది డీలర్ల నుంచి లంచం తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చినట్లు ఈడీ ఆరోపించింది.

ఈ కేసు విచారణ సందర్భంగా ఆప్ నేత సంజయ్ సింగ్ కోర్టులో మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రధాని మోదీ ఓడిపోతున్నారని అన్నారు. అందుకే విపక్షాలపై దాడులు చేస్తు్నారని అన్నారు. ఏ ప్రాతిపదికన అరెస్టు చేశారో చెప్పాలని సంజయ్ సింగ్ తరఫు న్యాయవాది మోహిత్ మాథుర్ అన్నారు. తమకు రిమాండ్ పేపర్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తప్పకుండా ఇస్తామని చెప్పిన ఈడీ.. అక్కడే రిమాండ్ పేపర్ ఇచ్చింది.

అయితే ఈడీ తరపు న్యాయవాది దినేష్ అరోరా వాదనలు వినిపిస్తూ.. రెండు వేర్వేరు లావాదేవీలు జరిగాయని కోర్టులో పేర్కొన్నారు. ఇందులో మొత్తం రూ.2 కోట్ల లావాదేవీలు జరిగాయని అన్నారు. సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ రిమాండ్ పేపర్‌లో సంజయ్ సింగ్ ఇంట్లో నగదు లావాదేవీల ప్రస్తావన ఉంది. మొదటి విడతలో కోటి రూపాయలు, రెండో విడతలో కోటి రూపాయల లావాదేవీ సంజయ్ సింగ్ ఇంట్లో జరిగినట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి:

Gujarat : అతను హెల్మెట్ పెట్టుకోకపోయినా పోలీసులు జరిమానా విధించరు.. కారణం ఏంటో తెలుసా?

35% Reservation for Women: మహిళలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 35% రిజర్వేషన్.. సంచలన ప్రకటన చేసిన సీఎం