ఏపీ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయండి : గవర్నర్ ను కోరిన కన్నా

హైదరాబాద్: ఏపీలో శాంతి భద్రతల క్షిణించాయని, ప్రభుత్వాన్ని వెంటనే బర్తరఫ్ చెయాలని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నాలక్ష్మీ నారాయణ గవర్నర్ కు విజ్ఞప్తి చేశారు. బుధవారం ఆయన రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ తో భేటీ అయి రాష్ట్రంలో నెకొన్న పరిస్ధితులను వివరించారు. డేటా వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను కలిసిన బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కన్నా….ఐటీ గ్రిడ్ కంపెనీ దగ్గర ఏపీ ప్రజల డాటా పెట్టడం ఎంత వరకు క్షేమం ?అని ప్రశ్నించారు.
“ప్రయివేటు కంపెనీ మీద ఫిర్యాదు చేస్తే… ఏపీ సీఎం, ప్రభుత్వ పెద్దలు ఎందుకు మాట్లాడుతున్నారు ? ఏపీ పోలీసులు హైదరాబాద్ దాకా రావడం ఎందుకు ? ముద్దాయి మా దగ్గరే ఉన్నాడని టీడీపీ చెప్పడం సిగ్గుచేటని” కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఈ కేసులో నిష్ఫక్షపాతంగా విచారణ జరిపించాలని ఆయన కోరారు. ఏపీ ప్రభుత్వం..తన పని తాను చేసుకోవడం లేదని, ఇప్పుడు గవర్నర్ ను కలిశాం త్వరలో ఎన్నికల కమిషన్ ను కలుస్తాం అని ఆయన చెప్పారు. ఇది కేవలం ఏపీ, తెలంగాణ సమస్య కాదని 5కోట్ల ఆంధ్రుల సమస్య అని కన్నా పేర్కోన్నారు. విషయాన్ని పక్కదారి పట్టించడానికి కుట్రలు సాగుతున్నాయని, ప్రభుత్వం నిస్సిగ్గుగా, నిర్లజ్జగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు.