మీ తాటాకు చప్పుళ్లకు వైసీపీ భయపడదు : బొత్స 

  • Published By: chvmurthy ,Published On : March 5, 2019 / 01:29 PM IST
మీ తాటాకు చప్పుళ్లకు వైసీపీ భయపడదు : బొత్స 

Updated On : March 5, 2019 / 1:29 PM IST

హైదరాబాద్: టీడీపీ తాటాకు చప్పుళ్లుకు వైసీపీ  భయపడదని ఆ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. మా తాలూకు సమాచారాన్ని ప్రయివేట్ కంపెనీలకు ఎలా ఇచ్చారని ఆయన ఏపీ సీఎంని, టీడీపీ నేతలను ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వం గోప్యంగా ఉంచాల్సిన వివరాలను బహిరంగ పరిచిందని ఆరోపించారు. హైదరాబాద్ లో వ్యక్తులు పోలీసులకు సమాచారం ఇస్తే ఏపీ  ప్రభుత్వం ఎదురుదాడి చేస్తోందని బొత్స అన్నారు. జె. సత్యనారాయణ అనే రిటర్డ్ అధికారి ద్వారా ఆధార్ సమాచారం బయటకు వచ్చిందని ఆయన తెలిపారు. దీనిపై ఆ ఉద్యోగి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
Also Read : టీడీపీకి షాక్: జగన్ పార్టీలోకి మరో ఎమ్మెల్యే

ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ లో 10 ఏళ్ళు ఉండే  హక్కు  ఏపీ ప్రజలకు ఉందని, అటువంటప్పుడు ఏపీ లో జరిగిన డేటా చోరీ గురించి  హైదరాబాద్ లో ఫిర్యాదు చేస్తే తప్పేంటి అన్నారు. డేటా అన్ని రాజకీయ పార్టీలకు ఉంటదని, ప్రభుత్వం ఏపీ పౌరుల డేటాను సేవ మిత్ర ద్వారా దుర్వినియోగం చేస్తోందని తెలిపారు. విజయనగరం కుమిలి గ్రామంలో ఐ ప్యాడ్ లో అంతా సమాచారం ఉందని  గతంలోనే తాను చెప్పిన విషయాన్ని బొత్స గుర్తు చేశారు. ఆరోజు తాను ఆరోపిస్తే  పోలీసులు వైసీపీ నాయకుల ఇళ్ల పై దాడులు చేసి వేధించారని , ఈరోజు వాస్తవాలు బయటకు వచ్చేసరికి ప్రభుత్వం మళ్లీ  బెదిరిస్తోందని చెప్పారు. ఓట్ల తొలగింపువిషయమై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని  బొత్స డిమాండ్  చేశారు.  ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఓట్లు ఉన్న వివరాలు మాత్రమే ఎన్నికల కమిషన్ కు ఇచ్చాం అని ఆయన వివరించారు.   
Also Read : అది ప్రభుత్వం తప్పే.. టీఆర్‌ఎస్ ఆరు సీట్లు కూడా గెలవదు

చంద్రబాబు ఐటీ గ్రిడ్ సంస్ధతో కుమ్మక్కయ్యారని, ఆసంస్ధకు కోట్ల రూపాయల కాంట్రాక్టులు  కట్టబెట్టి, భూములు కేటాయించారని అన్నారు.పిల్లి కళ్లు మూసుకుని పాలు  తాగినట్లు చంద్రబాబు  వ్యవహరిస్తున్నారని, అక్రమ మార్గంలో ఓట్లు వేయించుకోవడానికి ఐటీ గ్రిడ్ సంస్ధతో  కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.
Also Read : కాంగ్రెస్‌తో బీజేపీ సీక్రెట్‌ పొత్తు