ప్రముఖ పాత్రికేయుడు పొత్తూరి వెంకటేశ్వరరావు కన్నుమూత

ప్రముఖ పాత్రికేయుడు పొత్తూరి వెంకటేశ్వరరావు (86) కన్నుమూశారు. బంజారాహిల్స్ లోని ప్రైవేటు ఆసుపత్రిలో కొంతకాలంగా ఆయన చికిత్స తీసుకున్నారు. 2020, మార్చి 05వ తేదీ గురువారం ఉదయం తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.
1934 ఫిబ్రవరి 08న గుంటూరు జిల్లా పొత్తూరులో జన్మించారు వెంకటేశ్వరరావు. పత్రికా రంగంలో ఐదు దశాబ్దాలకు పైగా సేవలందించారు. 1957లో ఆంధ్ర జనతా పత్రికతో పాత్రికేయ ప్రస్థానం ప్రారంభించారు. ఈనాడు, ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ, వార్త పత్రికల్లో పొత్తూరి పనిచేశారు. ఈయన మృతికి పలువురు సంతాపం తెలియచేశారు.
* ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రెస్ అకాడమీ ఛైర్మన్‌గా పని చేశారు.
* సాహిత్యం, సాంస్కృతికం, రాజకీయ అంశాలపై అనేక రచనలు చేశారు.
* పారమార్థిక పదకోశం, నాటి పత్రికల మేటి విలువలు, చింతన, విధి నా సారథి, వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు వంటి రచనలు చేశారు.
* 2000లో ఆయన రచించిన ‘నాటి పత్రికల మేటి విలువలు’, 2001లో రచించిన చింతన, చిరస్మరణీయులు పుస్తకాలు ఆయనకు మంచి పేరును తెచ్చిపెట్టాయి.
* పీవీ గురించి రాసిన ‘‘ఇయర్స్ ఆఫ్ పవర్’లో సహ రచయితగా ఉన్నారు.
* అనేక మంది జర్నలిస్టులను తయారు చేశారు.
* రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక రాష్ట్ర వాదనకు మద్దతు తెలిపారు.
* సీఎం కేసీఆర్ కూడా ఆయన స్వగృహానికి కూడా వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు.
Read More : విశాఖలో కరోనా కలకలం : కుటుంబంలో ముగ్గురికి వైరస్!