షర్మిలను బూతులు తిడతారా..! కొడాలి నాని, మంత్రి రోజాపై గోనె ప్రకాశ్ ఫైర్

చంద్రబాబుకు ఓటు లేదని రోజా అంటారు. ఓటు లేకపోతే పోటీ చేయరు అని రోజా తెలుసుకోవాలి అని గోనె ప్రకాశ్ అన్నారు.

షర్మిలను బూతులు తిడతారా..! కొడాలి నాని, మంత్రి రోజాపై గోనె ప్రకాశ్ ఫైర్

Gone Prakash

Updated On : February 1, 2024 / 6:19 PM IST

ఏపీ మంత్రి రోజా, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానిపై ఫైర్ అయ్యారు గోనె ప్రకాశ్. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విషయంలో వారిద్దరిపై ఆయన విరుచుకుపడ్డారు. షర్మిలను విమర్శిస్తే ఊరుకునేది లేదన్నారు గోనె ప్రకాశ్. షర్మిలకు ఫుల్ సపోర్ట్ ప్రకటించారాయన. ”ఆర్ కృష్ణయ్యది ఏ ఊరు? ఆయనకు రాజ్యసభ పదవి ఎలా ఇచ్చారు? నిరంజన్ రెడ్డిది ఏ ఊరు? పరిమల్ కు రాజ్యసభ పదవి ఎలా ఇచ్చారు?” అని వైసీపీ నేతలను నిలదీశారు గోనె ప్రకాశ్.

ఓటు లేనోళ్లు, పరాయి వాళ్లు అని షర్మిలను అంటారా? అని మండిపడ్డారు. చంద్రబాబుకు ఓటు లేదని రోజా అంటారు. ఓటు లేకపోతే పోటీ చేయరు అని రోజా తెలుసుకోవాలి అని గోనె ప్రకాశ్ అన్నారు. బూతుల నాని, బూతుల రోజా.. అంటూ నిప్పులు చెరిగారు గోనె ప్రకాశ్.

Also Read : 3 సార్లు ఓడినా నాల్గోసారి పట్టువదలని విక్రమార్కుడిలా.. పోటీలోకి చలమలశెట్టి సునీల్.. పూర్తి వివరాలు..

”పవన్ కల్యాణ్ కు ఓటు లేదు, లోకేశ్ కు ఓటు లేదు అని రోజా అంటారు. ఆ రాష్ట్రంలో ఓటు హక్కు లేకపోతే ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ కావడానికి వీల్లేదు. లోక్ సభ, రాజ్యసభ సభ్యులుగా దేశంలో ఎక్కడన్నా కావొచ్చు. గతంలో రాజ్యసభ ఆ రాష్ట్రంలో ఓటు ఉండాలి అని ఉండేది. ఇప్పుడు అది తీసేశారు. అది మరిచి మంత్రి రోజా మాట్లాడుతున్నారు. చంద్రబాబుది నారా వారి పల్లె. అక్కడ ఆయనకు ఇల్లు ఉంది, ఓటు ఉంది.

2014 కంటే ముందు షర్మిల పాదయాత్ర చేసి తర్వాత కనిపించలేదు. ఎక్కడికి పోయిందో అని బూతుల నాని అడుగుతున్నారు. అయ్యా, బూతుల నాని.. 18 ఉప ఎన్నికలు వచ్చాయి. మీ నాయకుడు జగన్ జైల్లో ఉంటే పార్టీని రక్షించుకోవడం కోసం ఆ 18 ఉపఎన్నికల్లో షర్మిల పాదయాత్ర చేశారు. ఆ రోజు షర్మిల ప్రచారం చేయకపోతే, ఆరేడు సీట్లు మాత్రమే గెలిచేది” అని గోనె ప్రకాశ్ అన్నారు.

Also Read : సీట్ల స‌ర్దుబాటుపై టీడీపీ స్పెష‌ల్ ఫోక‌స్‌.. అభ్య‌ర్థుల ఖ‌రారుపై చంద్ర‌బాబు క‌స‌ర‌త్తు