జగన్ కు షాక్ : టీడీపీలోకి మార్కాపురం ఎమ్మెల్యే!

ప్రకాశం జిల్లా మార్కాపురం వైసీపీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి అసంతృప్తిలో ఉన్నారు. సిట్టింగ్ సీటును తనకు కాకుండా వేరే వారికి కేటాయించడంపై ఆగ్రహంతో ఉన్నారు. వైసీపీకి గుడ్ బై చెప్పి.. టీడీపీలో జాయిన్ కావటానికి సిద్ధం అయినట్లు వార్తలు వస్తున్నాయి. కార్యకర్తలతోనూ భేటీ అయ్యారు. మార్కాపురం అసెంబ్లీ స్థానాన్ని మాజీ ఎమ్మెల్యే కేపీ కొండారెడ్డి తనయుడు నాగార్జునరెడ్డికి కేటాయించటాన్ని వ్యతిరేకిస్తున్నారాయన. పార్టీలోకి రమ్మని టీడీపీ ఆఫర్ ఇచ్చినా.. పార్టీ మారేందుకు మొగ్గు చూపలేదని.. అలాంటి నన్ను జగన్ మోసం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జంకె వెంకటరెడ్డి.
ఎన్నికల వేళ ప్రకాశం జిల్లా రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. పార్టీలు మారే నేతలు.. ఆయా స్థానాల్లో నేతలను మారుస్తుండటంతో.. సిట్టింగ్స్, ఆశావహులు పక్కచూపులు చూస్తున్నారు. అనుచరులతో భేటీ అయ్యి.. చకచకా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రకాశం జిల్లాలో ఒక్క వైసీపీలోనే కాకుండా టీడీపీలోనూ టికెట్ల లొల్లి తారాస్థాయికి చేరింది. సిట్టింగ్స్ స్థానాలు మార్చటం, కొత్త వారికి అవకాశం ఇస్తుండటంతో.. ఆయా పార్టీల్లో రచ్చ రచ్చ జరుగుతుంది.