నాలెడ్జ్ బాడీలో కాదు బుర్రలో ఉంటుంది : అచ్చెన్నపై కొడాలి సెటైర్లు
ఏపీ అసెంబ్లీలో సన్నబియ్యంపై చర్చ సందర్భంగా అధికార, ప్రతిపక్షం మధ్య మాటలయుద్యదం నడిచింది. టీడీపీ సభ్యుడు అచ్చెన్నాయుడుపై మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు సభలో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీశాయి.

ఏపీ అసెంబ్లీలో సన్నబియ్యంపై చర్చ సందర్భంగా అధికార, ప్రతిపక్షం మధ్య మాటలయుద్యదం నడిచింది. టీడీపీ సభ్యుడు అచ్చెన్నాయుడుపై మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు సభలో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీశాయి.
ఏపీ అసెంబ్లీలో సన్నబియ్యంపై చర్చ సందర్భంగా అధికార, ప్రతిపక్షం మధ్య మాటలయుద్ధం నడిచింది. టీడీపీ సభ్యుడు అచ్చెన్నాయుడుపై మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు సభలో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీశాయి. బాడీని బట్టి బుర్ర ఉండదంటూ అచ్చెన్నాయుడుపై నాని సెటైర్లు వేశారు. అచ్చెన్నకు పెద్ద బాడీ ఉంది కాబట్టి పెద్ద నాలెడ్జ్ ఉందని ఫీలువుతున్నారని అన్నారు. నాలెడ్డ్ అనేది బాడీలో ఉండదని.. బ్రెయిన్ లో ఉంటుందని తెలిపారు.
డ్రామా నాయడుని కూర్చొబెట్టాలని స్పీకర్ ను కోరారు. అనంతరం టీడీపీ సభ్యులు మాట్లాడుతూ కొడాలి నాని పార్లమెంటరీ పదాలు వాడారని తెలిపారు. ప్రజలకు సన్నబియ్యం ఇస్తామని ఎక్కడా చెప్పలేదని మంత్రి కొడాలి నాని అన్నారు. ఇప్పుడు ఎవరికీ సన్నబియ్యం సరఫరా చేయడం లేదన్నారు. గత ప్రభుత్వం కొనుగోలు చేసిన బియ్యాన్నే సరఫరా చేస్తున్నామని తెలిపారు.
వాలంటీర్ల ద్వారా శ్రీకాకుళం జిల్లాలో మాత్రమే బియ్యం సరఫరా చేస్తున్నామని చెప్పారు. రైలు మిల్లర్లే డబ్బులు తీసుకోకుండా బియ్యం ప్యాకింగ్ చేస్తున్నారని తెలిపారు. డబ్బులు తీసుకోవడం లేదు కాబట్టి అవినీతికి ఆస్కారం లేదన్నారు.