IPL నా వల్లే ఇండియాలో జరుగుతుంది : మోడీ

IPL నా వల్లే ఇండియాలో జరుగుతుంది : మోడీ

Updated On : May 3, 2019 / 1:04 PM IST

దేశంలో ఒకే సమయంలో ఐపీఎల్.. సాధారణ ఎన్నికలు నిర్వహించిన ఘనత మా ప్రభుత్వానిదేనని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో భారత ఫేవరేట్ టోర్నమెంట్‌కు భద్రత కల్పించలేక విదేశాలకు పంపేశారని ఎండగట్టారు. 

రాజస్థాన్ కరౌలి ప్రాంతంలో జరిగిన ర్యాలీలో పాల్గొన్న మోడీ.. ‘ఐపీఎల్ అంటే యువతకు అమితాసక్తి ఉన్న మాట వాస్తవం. యూపీఏ గవర్నమెంట్ ఉన్న సమయంలో ఎన్నికలు, ఐపీఎల్ ఒకేసారి వచ్చాయి. ఇలా 2009, 2014లో వచ్చినప్పటికీ ఒకేసారి నిర్వహించలేక విదేశాల్లో నిర్వహించుకునేలా చేసింది యూపీఏ గవర్నమెంట్. టెర్రరిస్ట్‌లు అని ధైర్యం లేకుండా ప్రవర్తించింది’ అప్పటి ప్రభుత్వం. 

‘వారంతా అప్పుడు భయపడి పారిపోయారు. మోడీ ప్రభుత్వం నిల్చొని జరిపించాం’ అని తెలిపారు. 2009సీజన్‌ను భద్రతా కారణాల రీత్యా ఎలక్షన్ కమిషన్ చాలినంత బలగాలు లేవని సూచించడంతో విదేశాల్లో నిర్వహించారు. 2014లోనూ టోర్నమెంట్‌లోని కొన్ని మ్యాచ్‌లను లోక్‌సభ ఎన్నికల సందర్భంగా విదేశాల్లోనే నిర్వహించారు.

2019లో నరేంద్ర మోడీ హయంలోనే సాధారణ ఎన్నికలు, లోకసభ ఎన్నికలతో పాటు ఐపీఎల్ 12వ సీజన్‌ను కూడా నిర్వహిస్తున్నారు. ఐపీఎల్ దాదాపు గ్రూప్ దశ మే 7తో ముగియనుండటంతో ఏప్రిల్ 8నుంచి ప్లే ఆఫ్ కూడా ఆడేందుకు సిద్ధమవుతోంది.