రాజధాని మార్చడం సరికాదు : ఎంపీ కనకమేడల
ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడితే చర్యలు తీసుకోవాలి..రాజధాని మార్చడం సరికాదని ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అన్నారు.

ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడితే చర్యలు తీసుకోవాలి..రాజధాని మార్చడం సరికాదని ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అన్నారు.
ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడితే చర్యలు తీసుకోవాలి..రాజధాని మార్చడం సరికాదని ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అన్నారు. శుక్రవారం (జనవరి 3, 2020) ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రం విడిపోక ముందు కొన్న భూములను చూపించి ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటున్నారని చెప్పారు.
ఇన్ సైడర్ ట్రేడింగ్ కంపెనీలు, షేర్లకు సంబంధించింది..భూములది కాదన్నారు. వైఫల్యాలు, అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందన్నారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ పై చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. ప్రభుత్వ అధికారులను భయపెట్టి విశాఖ, భీమిలి, శ్రీకాకుళంలో రికార్డుల్లో భూముల వివరాలు మార్చి సొంతం చేసుకుంటున్నారని ఆరోపించారు.
రాజధాని తరలింపు నిర్ణయం సరికాదని నిన్న మీడియతో మాట్లాడుతూ కూడా చెప్పారు. అమరావతి అభివృద్ధికి రూ.6 వేల కోట్లు ఖర్చు పెడితే రూ.53 వేల కోట్ల సంపద వస్తుందన్నారు. ఆ సంపదతో 13 జిల్లాలను అభివృద్ధి చేసుకోవచ్చన్నారు. రాజధాని నిర్మాణానికి వైసీపీ ప్రభుత్వం రూపాయి ఖర్చు పెట్టలేదన్నారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులను రోడ్డున పడేస్తున్నారు. రాజధాని తరలింపుపై ప్రభుత్వ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు స్పందించాలని…లేకుంటే వారి బిడ్డల భవిష్యత్ ప్రశ్నార్థకమవుతుందన్నారు.
రాజధాని తరలింపు ప్రతిపాదనకు వ్యతిరేకంగా వెలగపూడిలో 17వ రోజు కూడా దీక్షలు కొనసాగాయి. అమరావతికి భూములిచ్చిన రైతులను కించపరిచే విధంగా వైసీపీ నాయకులు, మంత్రులు మాట్లాడుతున్నారని రాజధాని వాసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అమరావతిలో పూర్తిస్థాయి రాజధాని కొనసాగిస్తామని ప్రభుత్వం ప్రకటించే వరకు దీక్ష కొనసాగుతుందన్నారు.