గెలుపు ఖాయమేనా : మంగళగిరి నుంచి ఎన్నికల బరిలోకి లోకేశ్

అమరావతి: తెలుగుదేశం పార్టీలో ఉత్కంఠకు తెరపడింది. ఊహాగానాలకు చెక్‌ పెడింది. పార్టీ ప్రధాన కార్యదర్శి పోటీ చేసే స్థానంపై క్లారిటీ ఇచ్చేశారు. లోకేశ్‌ పోటీ చేయడం ద్వారా

  • Published By: veegamteam ,Published On : March 13, 2019 / 03:25 PM IST
గెలుపు ఖాయమేనా : మంగళగిరి నుంచి ఎన్నికల బరిలోకి లోకేశ్

అమరావతి: తెలుగుదేశం పార్టీలో ఉత్కంఠకు తెరపడింది. ఊహాగానాలకు చెక్‌ పెడింది. పార్టీ ప్రధాన కార్యదర్శి పోటీ చేసే స్థానంపై క్లారిటీ ఇచ్చేశారు. లోకేశ్‌ పోటీ చేయడం ద్వారా

అమరావతి: తెలుగుదేశం పార్టీలో ఉత్కంఠకు తెరపడింది. ఊహాగానాలకు చెక్‌ పెడింది. పార్టీ ప్రధాన కార్యదర్శి పోటీ చేసే స్థానంపై క్లారిటీ ఇచ్చేశారు. లోకేశ్‌ పోటీ చేయడం ద్వారా అమరావతి ప్రాంతంపై పట్టు సాధించేలా కీలక నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు. తొలిసారి మంత్రి లోకేశ్‌…ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నారు.

గుంటూరు జిల్లాలోని మంగళగిరి అసెంబ్లీ నుంచి లోకేశ్ పోటీ చేయనున్నట్లు పార్టీ అధినేత చంద్రబాబు స్పష్టత ఇచ్చారు. కుప్పం, భీమిలి, పెదకూరపాడు అంటూ పలు నియోజకవర్గాల పేర్లు వినిపించినప్పటికీ….రాజధాని ప్రాంతం నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుందని పార్టీ నేతల అభిప్రాయాలు తీసుకున్నారు. కృష్ణా జిల్లాలో 16, గుంటూరు జిల్లాలో 17 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. రాజధాని ప్రాంతంలో పట్టు సాధించాలంటే ఈ 2 జిల్లాల్లో ఎక్కడో ఒక చోట నుంచి లోకేశ్‌ పోటీ చేస్తే బాగుంటుందని పార్టీ నేతలు అభిప్రాయపడ్డారు. అమరావతి ప్రాంతంలో లోకేశ్‌ పోటీ చేయడం ద్వారా…తెలుగుదేశం పార్టీకి మంచి ఫలితాలు వస్తాయని చంద్రబాబు అంచనా వేసుకున్నారు.

మంగళగిరి నియోజకవర్గం నుంచి లోకేశ్‌ అభ్యర్థిత్వం ఖరారు చేసే ముందు…సామాజిక సమీకరణాలు, పార్టీ బలాబలాలు, ప్రత్యర్థుల బలహీనతలపై కసరత్తు చేశారు. మంగళగిరి టీడీపీ నేతలతోనూ చంద్రబాబు చర్చలు జరిపారు. ఇక్కడ బీసీ ఓటర్లు అత్యధికంగా ఉండటం…. అమరావతి రాజధాని కావడంతో.. మంగళగిరి అభివృద్ధి చెందిందనే భావన ఇక్కడి ప్రజల్లో ఉంది. మంగళగిరికి ఐటీ కంపెనీలు రావడంతో పాటు, అభివృద్ధి పనులు టీడీపీకి కలిసి వస్తాయనే భావనలో ఉన్నారు. లోకేశ్‌ పోటీ చేస్తే.. మంగళగిరి వాసులు.. ఓట్లతో ఆశీర్వదిస్తారని బలంగా నమ్ముతున్నారు టీడీపీ నేతలు.

2014లో జరిగిన ఎన్నికల్లో మంగళగిరి నుంచి టీడీపీ అభ్యర్థిగా చిరంజీవి పోటీ చేశారు. చిరంజీవిపై కేవలం 12 ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి విజయం సాధించారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ బలంగా ఉండటం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి వెళ్లడం ప్లస్ అయ్యాయి. దీంతో మంగళగిరి నుంచి లోకేశ్‌ గ్యారంటీగా గెలుస్తాడని….మంచి మెజార్టీ కూడా వస్తుందన్న ధీమాతోనే గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చారు చంద్రబాబు.

వాస్తవానికి 2014లోనే ఎన్నికల బరిలో దిగాలని లోకేశ్ భావించారు. ఆ ఎన్నికల్లో పార్టీ అంతర్గత వ్యవహారాలపై దృష్టి పెట్టడంతో వీలు కాలేదు. ఆ తర్వాత మంత్రిగా బాధ్యతలు తీసుకునే సమయంలోనూ చినబాబు పోటీకే సై అన్నారు. మరొకరితో రాజీనామా చేయించి పోటీ చేయడం ఇష్టం లేక అప్పట్లో ఆ నిర్ణయాన్ని పక్కనబెట్టారు. చివరికి ఎమ్మెల్సీ పదవితో మంత్రి పదవిని చేపట్టారు. ఆ తర్వాత క్రమంగా పార్టీలో పట్టు సాధించి…మంత్రిగా తానేంటో నిరూపించుకున్నారు లోకేశ్‌. పోటీ చేస్తే స్థానంపై క్లారిటీ రావడంతో…పార్టీ శ్రేణులతో పాటు అమరావతి ప్రాంతంలోని నేతలు సంబరాల్లో మునిగిపోయారు. లోకేశ్‌ను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని హామీ ఇచ్చారు.