రేపోమాపో జగన్ జైలుకెళతారు- నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు

బాబాయ్ ని చంపింది ఎవరు? పిన్ని తాళిబొట్లు తెంపింది ఎవరు? ఇది జగనాసుర రక్తచరిత్ర.

రేపోమాపో జగన్ జైలుకెళతారు- నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh On CM Jagan In Srikakulam Shankharavam

Nara Lokesh : ఏపీ సీఎం జగన్ పై విరుచుకుపడ్డారు టీడీపీ నేత నారా లోకేశ్. శ్రీకాకుళం నగరంలో శంఖారావంలో నారా లోకేశ్ మాట్లాడారు. రెండు నెలల్లో తాడేపల్లి గేట్లు పగలగొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని అర్థమవుతోందన్నారు నారా లోకేశ్. అరసవిల్లి సూర్యదేవాలయం ఉన్న భూమి శ్రీకాకుళం, ఇక్కడ మాట్లాడటం నా అదృష్టంగా భావిస్తున్నా అని చెప్పారు. జగన్ రెడ్డి పని అయిపోయిందని వైసీపీ ఎమ్మెల్యేలే చెబుతున్నారని లోకేశ్ అన్నారు.

”25 మందికి 25 మంది ఎంపీలను గెలిపిస్తే హోదా తీసుకొస్తామన్నారు. వైసీపీకి 31 మంది ఎంపీలను ఇస్తే ఏం చేశారు? కేసుల మాఫీ కోసం కేంద్రం ముందు మెడ వంచారు. జగన్ రెడ్డికి వైసీపీ ఎంపీలే ముఖం చాటేస్తున్నారు. జగన్ ఢిల్లీ వెళితే 31 మందిలో ఆరుగురు మాత్రమే ఆయన వెంట వెళ్లారు. వారు బైబై జగన్ అని చెప్పే పరిస్థితి వచ్చింది. వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తానని చెప్పి, ఉద్యోగులను మాయ చేసే జీపీఎస్ తెచ్చారు. ఉద్యోగులు కూడా బైబై జగన్ అంటున్నారు.

Also Read : కృష్ణా జిల్లాలో టీడీపీ, వైసీపీ మధ్య హోరాహోరీ.. అభ్యర్థులు వీళ్లే?

ఇప్పుడు ఒక కొత్త పథకం తెచ్చారు. ఆ పథకం పేరు ఎమ్మెల్యేల ట్రాన్సఫర్. ఒకరి ఇంట్లో చెత్త ఇంకో చోట బంగారం అవుతుందా? ఇక్కడ పనికి రాని వారు పక్క నియోజకవర్గంలో ఎలా పనికొస్తారు? బాబాయ్ ని చంపింది ఎవరు? పిన్ని తాళిబొట్లు తెంపింది ఎవరు? ఇది జగనాసుర రక్తచరిత్ర. జగన్ సొంత తమ్ముడు వైఎస్ అవినాశ్ రెడ్డి వివేకాను చంపారు. రేపో మాపో జగన్ రెడ్డి కూడా జైలుకెళతారు.

ఎన్నికలకు ముందు చంద్రబాబు చంపారని చెప్పారు. చార్జిషీటులో వారి ఎంపీ అవినాశ్ రెడ్డి పేరు ఉంది. రేపోమాపో జగన్ పేరు కూడా ఆ లిస్టులో చేరుతుంది. కోడికత్తితో పొడిపించుకుని మనపై ఆ కేసును వేయాలని చూశారు. రోజు జగన్ తినేది ఇసుక. ఒకప్పుడు ఇసుక 1500లకు దొరికేది. కానీ, ఇప్పుడు ఇసుకను బుక్కేస్తున్నారు. జగన్ తాగేది ప్రజల రక్తం. క్వార్టర్ పై రూ.25 జే-ట్యాక్స్ కట్టించుకుంటున్నారు. ఇది నేరుగా జగన్ జేబులోకి వెళుతోంది. మద్యం ద్వారా ఏడాది 9వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో 45వేల కోట్లు మింగేశారు. మద్యం తయారు చేసేది, అమ్మేది జగన్ రెడ్డే.

జగన్ రెడ్డిని చూస్తే కటింగ్, ఫిట్టింగ్ మాస్టర్ గుర్తొస్తారు. ఆయన బ్లూ బటన్ నొక్కి రూ.10 ఎకౌంట్లలో వేస్తే.. రెడ్ బటన్ నొక్కి వంద లాగేస్తున్నారు. బాదుడే బాదుడుగా కరెంట్ ఛార్జీలు, చెత్త పన్ను, ఆర్టీసీ ఛార్జీలు పెంచి జనం జేబులు గుల్ల చేస్తున్నారు. అవకాశమిస్తే గాలిపైన కూడా పన్ను వేసే వ్యక్తి జగన్ రెడ్డి. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి ప్రజలను పీడిస్తున్నారు. రేపో మాపో వాలంటీర్లు వస్తారు. వారు ఓ గొట్టం పట్టుకొని వస్తారు. ఊదమంటారు. ఊదకండి.. ఊదితే గాలికి ట్యాక్స్ అంటారు. తస్మాత్ జాగ్రత్త.

Also Read : నర్సాపురం వైసీపీలో ఆసక్తికర రాజకీయం.. ఏం జరుగుతుందో తెలుసా?

2024కు టీడీపీని గెలిపిస్తే అనంతపురంకు కియా ఎలా వచ్చిందో.. అలానే శ్రీకాకుళంకు పరిశ్రమలు తెస్తా. ఇక్కడ ఓ సెజ్ ఏర్పాటు చేస్తాను. హైదరాబాద్, అమరావతి ఎక్కడ భవనాలు కడితే అక్కడ సిక్కోలు వాసులు ఉంటారు. మీకు ఇక్కడే ఉపాధి కల్పిస్తా. నా హయాంలో శ్రీకాకుళంలో ఐటీ పరిశ్రమ పెడతాను అంటే స్థలం ఇచ్చా. తర్వాత ఫాలోఅప్ చేయాల్సిన కోడి గుడ్డు మంత్రి దానిని ఫాలో అప్ చేయకపోవడం వల్లనే శ్రీకాకుళంకు ఐటీ పరిశ్రమ పోయింది. మంత్రిగా ఉన్న మీరు నియోజకవర్గంకు చేసిందేమిటి? కనీసం రోడ్డుపై ఉన్న గుంతలు కూడా పూడ్చలేదు. సావిత్రిపురం వద్ద 23 ఎకరాలు ధర్మాన కుటుంబసభ్యులు కొట్టేశారు” అని నారా లోకేశ్ అన్నారు.