Telangana: ఆయన చూపేమో బీజేపీవైపు.. కాంగ్రెస్‌కు వెళ్లమంటూ క్యాడర్ ఒత్తిళ్లు.. విచిత్ర పరిస్థితిలో పొంగులేటి
పొంగులేటి చాలా రోజులుగా బీజేపీ పెద్దలతో టచ్‌లో ఉన్నారని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. అయితే కేడర్ మాత్రం కాంగ్రెస్‌లో చేరాలని ఆయన మీద ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. దానికి కారణం, ఆయన మూలాలు ఆ పార్టీలో ఉండడం. దీంతో ఆయన కాంగ్రెస్‌లో చేరతారని ఆ పార్టీ నాయకత్వం ధీమా వ్యక్తం చేస్తోంది

Ponguleti Srinivas Reddy
Telangana: భారత్ రాష్ట్ర సమితి (BRS) నుంచి సస్పెండ్ అయిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) భారతీయ జనతా పార్టీలోకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్‌తో బంధం తెగిపోయిన అనంతరమే మొదట కాంగ్రెస్ పెద్దలు టచ్‌లోకి వెళ్లారని వార్తలు గుప్పుమన్నాయి. ఆ తర్వాత పొంగులేటికి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ టచ్‌లోకి వెళ్లినట్లు, కమల పార్టీలో చేరేందుకు పొంగులేటి సముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం.
పొంగులేటి చాలా రోజులుగా బీజేపీ పెద్దలతో టచ్‌లో ఉన్నారని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. అయితే కేడర్ మాత్రం కాంగ్రెస్‌లో చేరాలని ఆయన మీద ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. దానికి కారణం, ఆయన మూలాలు ఆ పార్టీలో ఉండడం. దీంతో ఆయన కాంగ్రెస్‌లో చేరతారని ఆ పార్టీ నాయకత్వం ధీమా వ్యక్తం చేస్తోంది. పైగా రేవంత్ రెడ్డి కూడా తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ పొంగులేటి తనకు మిత్రుడని వ్యాఖ్యానించడం పలు అనుమానాలకు తావునిస్తోంది. అయితే ఎటు వెళ్తారనేది చివరికి వరకు చెప్పలేమని కూడా అంటున్నారు.
Revanth Reddy : కేసీఆర్ ది మాఫియా మోడల్.. మోదీది కార్పొరేట్ మోడల్ : రేవంత్ రెడ్డి
ఒకవేళ ఇదేగానీ జరిగితే ఖమ్మంలో కాంగ్రెస్‌కు మంచిరోజులు వచ్చినట్లేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే రెండు మూడ్రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటించాలనే యోచనలో పొంగులేటి ఉన్నారట. అయితే ప్రస్తుతానికి ఆయనకు క్యేడర్ నుంచి ఒత్తిడి దృష్ట్యా అంత తొందరగా నిర్ణయం తీసుకోలేకపోతున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. మరి ఎటు వైపు వెళ్తారనేది తొందరలో తేలిపోతుంది.