రాజ్యసభ ఎన్నికలు.. ఎవరి బలం ఎంత? ఏపీ, తెలంగాణలో ఎన్ని సీట్లు ఖాళీ అంటే..
ఫిబ్రవరి 8న రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది.

Rajya Sabha Elections 2024
Rajya Sabha Elections 2024 : రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడదలైంది. 15 రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ ఖరారైంది. 56 మంది సభ్యుల ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేశారు రాజ్యసభ సెక్రటరీ. ఫిబ్రవరి 8న రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఫిబ్రవరి 27న రాజ్యసభ ఎన్నికల పోలింగ్ జరగబోతోంది.
* రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల
* 15 రాష్ట్రాల్లో ఏప్రిల్ 2,3 తేదీల నాటికి ఖాళీ అవుతున్న 56 రాజ్యసభ స్థానాలు
* ఏపీ నుంచి ఖాళీ అవుతున్న 3 రాజ్యసభ స్థానాలు
* తెలంగాణ నుంచి ఖాళీ అవుతున్న 3 రాజ్యసభ స్థానాలు
* ఉత్తరప్రదేశ్ నుంచి అత్యధికంగా ఖాళీ అవుతున్న 10 రాజ్యసభ స్థానాలు
* ఫిబ్రవరి 8న నోటిఫికేషన్ విడుదల
* నామినేషన్ల దాఖలుకు ఆఖరు తేదీ ఫిబ్రవరి 15
* ఫిబ్రవరి 16 నామినేషన్ల పరిశీలన
* నామినేషన్ల ఉపసంహరణకి ఫిబ్రవరి 20 గడువు
* ఫిబ్రవరి 27 పోలింగ్.. ఫలితాలు
* ఫిబ్రవరి 27 ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్..5గంటలకు ఓట్ల లెక్కింపు..ఫలితాలు
Also Read : రాజమండ్రి వైసీపీ ఎంపీ అభ్యర్థిపై ఉత్కంఠ.. మహిళ సహా ముగ్గురు పోటీ
* ఏపీలో ఖాళీ అవుతున్న మూడు రాజ్యసభ స్థానాలు.
* ఏప్రిల్ 3 తో ముగుస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కనకమేడల రవీంద్రకుమార్, సీఎం రమేష్ రాజ్యసభ పదవీకాలం.
* తెలంగాణలో ఖాళీ అవుతున్న 3 రాజ్యసభ స్థానాలు.
* ఏప్రిల్ 2 తో ముగుస్తున్న బడుగుల లింగయ్య యాదవ్, జోగినపల్లి సంతోష్, వద్దిరాజు రవిచంద్ర రాజ్యసభ పదవీకాలం.
* తెలంగాణ నుండి సోనియా గాంధీకి రాజ్యసభ సీటు ప్రపోజల్
* రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల
* ఖాళీ కానున్న 3 స్థానాల్లో 2 స్థానాలు కాంగ్రెస్ కు, ఒకటి బీఆర్ఎస్ కి దక్కే ఛాన్స్
* కాంగ్రెస్ రెండు స్థానాల్లో ఒకటి ఏఐసీసీకి, ఒకటి రాష్ట్ర నేతలకు అవకాశం ఇవ్వాలనే యోచనలో టీపీసీసీ
* ఏఐసీసీ కోటాలో సోనియా గాంధీకి తెలంగాణ నుండి రాజ్యసభ ఇవ్వాలని కాంగ్రెస్ ఆలోచన
* రెండవ సీటు కోసం భారీగా ఆశావహులు
* రాజ్యసభ స్థానం కోసం చిన్నారెడ్డి, రేణుకా చౌదరి, వంశీ చందర్ రెడ్డి, అద్దంకి దయాకర్ పేర్లు పరిశీలిస్తున్న కాంగ్రెస్
రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘ విడుదల చేసింది. ఏప్రిల్ 2,3 తేదీల్లో పలువురు రాజ్యసభ సభ్యుల పదవీ కాలం ముగుస్తుంది. 15 రాష్ట్రాలకు సంబంధించి రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఏపీలో మూడు, తెలంగాణలో మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఏపీ విషయానికి వస్తే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కనకమేడల రవీంద్ర కుమార్, సీఎం రమేశ్ ల రాజ్యసభ పదవీ కాలం ఏప్రిల్ 3తో ముగుస్తుంది.
Also Read : తెలంగాణలో బీఆర్ఎస్‌కు కొత్త టెన్షన్.. సీఎం రేవంత్‌తో ఎమ్మెల్యేల భేటీపై గులాబీ వర్గాల్లో గుబులు..!
ఇక, తెలంగాణ నుంచి బడుగుల లింగయ్య యాదవ్, జోగినపల్లి సంతోశ్, వద్దిరాజు రవిచంద్రల పదవీ కాలం ముగియనుంది. వీరంతా బీఆర్ఎస్ ఎంపీలు. ఏప్రిల్ 2వ తేదీతో వీరి పదవీ కాలం ముగుస్తుంది. ఈ స్థానాల భర్తీకి షెడ్యూల్ విడుదల చేసింది ఈసీ. ఫ్రిబ్రవరి 8న నోటిఫికేషన్ వెలువడునుంది. ఫిబ్రవరి 27న పోలింగ్, అదే రోజున ఫలితాల వెల్లడి ఉంటుంది. నామినేషన్ల దాఖలుకు ఆఖరి తేదీ ఫిబ్రవరి 15. ఫిబ్రవరి 16న నామినేషన్ల పరిశీలన, నామినేషన్ల ఉపసంహరణకు ఫిబ్రవరి 20వ తేదీ గడువు.
ఎవరి బలం ఎంత?
* ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యా బలం పరంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఇద్దరికి రాజ్యసభ పదవులు వచ్చే అవకాశం. బీఆర్ఎస్ నుంచి ఒకరికి అవకాశం.
* ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యా బలం పరంగా చూసుకుంటే.. అధికార వైసీపీ నుంచి ఇద్దరికి, టీడీపీ నుంచి ఒకరికి రాజ్యసభ స్థానం దక్కే అవకాశం.
* సంఖ్యా పరంగా చూసుకున్నట్లు అయితే.. ఈ 56 రాజ్యసభ స్థానాల్లో మెజార్టీ స్థానాలు బీజేపీకి చెందిన వారికి దక్కే అవకాశం కనిపిస్తోంది. రాజ్యసభలో మరింత పెరగనున్న ఎన్డీయే బలం.
* బీఆర్ఎస్ ఎంపీల సంఖ్యా బలం తగ్గనుంది.