రాహుల్ గాంధీ బుజ్జగించినా తగ్గలేదు : టీఆర్ఎస్‌లోకి సబిత

కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ బుజ్జగించినా తగ్గలేదు. రేవంత్ రెడ్డి రాయబారం ఫలించలేదు. మాజీ హోంమంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తన నిర్ణయం మార్చుకోలేదు.

  • Published By: veegamteam ,Published On : March 12, 2019 / 02:04 PM IST
రాహుల్ గాంధీ బుజ్జగించినా తగ్గలేదు : టీఆర్ఎస్‌లోకి సబిత

Updated On : March 12, 2019 / 2:04 PM IST

కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ బుజ్జగించినా తగ్గలేదు. రేవంత్ రెడ్డి రాయబారం ఫలించలేదు. మాజీ హోంమంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తన నిర్ణయం మార్చుకోలేదు.

కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ బుజ్జగించినా తగ్గలేదు. రేవంత్ రెడ్డి రాయబారం ఫలించలేదు. మాజీ హోంమంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తన నిర్ణయం మార్చుకోలేదు. టీఆర్ఎస్ లో చేరాలని ఆమె ఫిక్స్ అయ్యారు. బుధవారం (మార్చి 13) సబితా ఇంద్రారెడ్డి, ఆమె కుమారుడు కార్తిక్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరే అవకాశం ఉందని సమాచారం.
Read Also : గాజువాక, పిఠాపురం : తేల్చుకోలేకపోతున్న పవన్ కళ్యాణ్

టీఆర్ఎస్ లో చేరే విషయమై 3 రోజుల క్రితం ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ నివాసంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో సబితా ఇంద్రారెడ్డి చర్చలు జరిపారు. ఒకటి, రెండు రోజుల్లో కారెక్కుతారని అందరూ అనుకున్నారు. టీఆర్ఎస్ లో చేరుతున్న సబితకు మంత్రి పదవి ఇస్తారని వార్తలు వచ్చాయి. అంతలోనే సబితా ఇంద్రారెడ్డి వెనక్కి తగ్గారని అనే వార్త బయటకు వచ్చింది.

కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సబితతో చర్చలు జరిపారు. పార్టీ మారొద్దని కోరారు. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీతో ఫోన్ లో మాట్లాడించారు. సబితతో మాట్లాడిన రాహుల్ గాంధీ.. ఢిల్లీ రావాలని సబితకు సూచించారు. దీంతో సబితా ఇంద్రారెడ్డి ప్రస్తుతానికి పార్టీ మారే ఆలోచనను వాయిదా వేసుకున్నారనే వార్తలు వచ్చాయి.

ఇంతలోనే ఆమె మళ్లీ షాక్ ఇచ్చారు. టీఆర్ఎస్ లో చేరేందుకు మొగ్గు చూపారు. సబిత ఎపిసోడ్ కాంగ్రెస్ లో కలకలం రేపుతోంది. ఎన్నికల సమయంలో సబిత పార్టీని వీడటం కాంగ్రెస్ శ్రేణులు మైనస్ గా భావిస్తున్నారు. ఈ పరిణామం లోక్ సభ ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉందని అంటున్నారు.
Read Also : రాఫెల్ డీల్‌పై రాహుల్ ఎటాక్ : అంబానీ ‘పేపర్ ప్లేన్’ కూడా చేయలేడు