చంద్రబాబు చేసిన తప్పులే జగన్ చేస్తున్నారు : పోలవరం రివర్స్ టెండర్లపై బీజేపీ ఎంపీ విమర్శలు
ఏపీ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ సుజనా చౌదరి మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం విషయంలో సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టారు. రివర్స్ టెండర్లపై అసంతృప్తి వ్యక్తం

ఏపీ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ సుజనా చౌదరి మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం విషయంలో సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టారు. రివర్స్ టెండర్లపై అసంతృప్తి వ్యక్తం
ఏపీ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ సుజనా చౌదరి మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం విషయంలో సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టారు. రివర్స్ టెండర్లపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రివర్స్ టెండర్ల వల్ల ఆదా అయ్యింది ఏమీ లేదన్నారు. రివర్స్ టెండర్ల ద్వారా డబ్బు ఆదా అవుతుందన్న గ్యారెంటీ ఏంటి అని జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నామమాత్రంగా రివర్స్ టెండరింగ్ నిర్వహించారని చెప్పారు. పోలవరం నిర్మాణ పనులపై శ్వేతపత్రం విడుదల చెయ్యాలని ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏపీలో ఆర్థిక వ్యవస్థ కుంటుపడిందని సుజనా చౌదరి వాపోయారు. బ్యాంకులు ఇప్పటికే ఆర్థికసాయం నిలిపేశాయని చెప్పారు. ఏపీకి పారిశ్రామికవేత్తలు రావడం లేదన్నారు. ఇసుక పాలసీపైనా స్పష్టత లేదన్నారు.
పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ రీటెండరింగ్ వద్దన్నా సీఎం జగన్ వినలేదని సుజనా చౌదరి అన్నారు. రివర్స్ టెండరింగ్ సరైన పద్ధతిలో జరగలేదన్నారు. హైడ్రో పవర్ ప్రాజెక్ట్, పోలవరం ప్రాజెక్ట్ కలిపి టెండర్లు పిలవడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. పార్టీ కార్యకర్తలకు ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. టీడీపీ ప్రభుత్వం చేసిన తప్పులను వైసీపీ ప్రభుత్వం చేస్తోందని సుజనా చౌదరి అన్నారు.
పోలవరం ప్రధాన ప్రాజెక్ట్ రీ-టెండరింగ్‌తో ఏపీ ప్రభుత్వానికి రూ.628 కోట్లు ఆదా అయ్యాయి అని అధికారులు తెలిపారు. గతంలో కంటే 12.6 శాతం తక్కువకు పనులు చేసేందుకు మేఘా ఇంజనీరింగ్ సంస్థ ముందుకొచ్చింది. ఏపీ ప్రభుత్వం రూ.4,987 కోట్లకు టెండర్ పిలవగా.. రూ.4,358 కోట్లకు మేఘా ఇంజనీరింగ్ టెండర్ వేసింది. హెడ్ వర్క్స్, జల విద్యుత్ కేంద్రాల నిర్మాణ పనులను మేఘా సంస్థ చేపట్టనుంది.