టీడీపీ తొలి జాబితా సిద్దం.. 16నుంచి చంద్రబాబు ప్రచారం

  • Published By: vamsi ,Published On : March 13, 2019 / 03:24 AM IST
టీడీపీ తొలి జాబితా సిద్దం.. 16నుంచి చంద్రబాబు ప్రచారం

Updated On : March 13, 2019 / 3:24 AM IST

ఎన్నకల షెడ్యూల్ రావడంతో అభ్యర్థుల జాబితాలను విడుదల చేసేందుకు పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. ఇప్పటికే వారి వారి అభ్యర్ధలకు సీట్లను ఖరారు చేసినట్లు చెప్పేసిన టీడీపీ అధికారికంగా జాబితాను విడుదల చేయాలని భావిస్తుంది. ఈ క్రమంలో రేపు(14 మార్చి 2019) తొలిజాబితాను విడుదల చేయనుంది. గురువారం టీడీపీ తొలి జాబితాను విడుదల చేసిన అనంతరం ఎన్నికల సమర శంఖారావం పూరించబోతుంది.

మార్చి 16వ తేదీ నుంచి ఎన్నికల ప్రచారం మొదలు పెట్టనున్న చంద్రబాబు.. తొలుత తిరుమల వెళ్లి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని, అనంతరం చిత్తూరు జిల్లా పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహిస్తారు. అదేరోజు సాయంత్రం శ్రీకాకుళానికి చేరుకుని అక్కడి పార్టీ నేతలతో ఆయన సమావేశం కానున్నారు.  మార్చి 16వ తేదీ నుంచి 19వ తేదీ వరకు 4రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటించి జిల్లాస్థాయి నాయకత్వం మొదలుకుని సేవామిత్రలు, బూత్‌స్థాయి కన్వీనర్ల వరకూ పార్టీ శ్రేణులను కలవనున్నారు. పర్యటనల అనంతరం రోడ్ షోలలో చంద్రబాబు పాల్గొనే అవకాశం ఉంది.