3 రాజధానుల కోసం : జగన్ ముందు మూడు ఆప్షన్లు

ఏపీ శాసనమండలిలో జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండు కీలక బిల్లులు(వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు) సెలక్ట్‌ కమిటీకి వెళ్లాయి. దీంతో రాజధాని తరలింపునకు బ్రేక్ పడింది. అయితే,

  • Published By: veegamteam ,Published On : January 23, 2020 / 03:22 AM IST
3 రాజధానుల కోసం : జగన్ ముందు మూడు ఆప్షన్లు

Updated On : January 23, 2020 / 3:22 AM IST

ఏపీ శాసనమండలిలో జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండు కీలక బిల్లులు(వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు) సెలక్ట్‌ కమిటీకి వెళ్లాయి. దీంతో రాజధాని తరలింపునకు బ్రేక్ పడింది. అయితే,

ఏపీ శాసనమండలిలో జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండు కీలక బిల్లులు(వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు) సెలక్ట్‌ కమిటీకి వెళ్లాయి. దీంతో రాజధాని తరలింపునకు బ్రేక్ పడింది. అయితే, ఇప్పుడు జగన్ ఏం చేస్తారనే ఆసక్తి, చర్చ అందరిలోనూ మొదలైంది. ఈ క్రమంలో అసలు సీఎం జగన్‌ ముందు ఉన్న ఆప్షన్లు ఏంటి..? సెలక్ట్‌ కమిటీ రిపోర్ట్‌ వచ్చేదాకా ఆగాలా..? లేక ఇంకా ఏవైనా ప్రత్యామ్నాయ మార్గాలున్నాయా..? ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన రెండు బిల్లులు సెలక్ట్‌ కమిటీకి వెళ్లడంతో.. జగన్‌ ఆలోచనలో పడ్డారు. ఐతే.. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం… జగన్ ముందు మూడు ఆప్షన్లు ఉన్నాయి.

ఆప్షన్ 1:
శాసనమండలి చైర్మన్ చెప్పిన ప్రకారం సెలక్ట్ కమిటీని నియమించి.. ఆ కమిటీ నివేదిక వచ్చే వరకు ఆగాలి. అసెంబ్లీ రూల్స్ ప్రకారం సెలక్ట్ కమిటీకి పంపిన ఏ బిల్లు అయినా కనీసం నెల రోజుల పాటు ఆగుతుంది. అత్యధికంగా మూడు నెలలు ఆపొచ్చు. అంటే, కనీసం నెల రోజుల పాటు జగన్ ప్రభుత్వం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ సెలక్ట్ కమిటీ మార్పులు, చేర్పులు సూచిస్తే మళ్లీ అసెంబ్లీ, శాసనమండలిలో చర్చించి ఆమోదం పొందాలి.

ఆప్షన్ 2:
సెలక్ట్ కమిటీకి బిల్లును పంపకుండా నేరుగా ఆర్డినెన్స్ తీసుకొచ్చి మూడు రాజధానులను ఏర్పాటు చేయడం. ఏదైనా ఆర్డినెన్స్ తీసుకొస్తే దాన్ని ఆరు నెలల్లోపు చట్టం చేసుకోవచ్చు. వచ్చే బడ్జెట్ సమావేశాల్లోపు దాన్ని ఆమోదింపజేసుకోవచ్చు. అయితే, అప్పుడు కూడా మళ్లీ ఇదే సమస్య వచ్చే అవకాశం లేకపోలేదు. మరోవైపు ఆర్డినెన్స్ తీసుకురావాలంటే ఇప్పుడు మరో సమస్య ఉంది. ఏదైనా బిల్లు ఆమోదం పొందకపోతే.. అప్పుడు ఆ బిల్లు స్థానంలో ఆర్డినెన్స్ తీసుకొస్తారు. ప్రస్తుతం ఈ రెండు బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపడం అంటే.. ఆ రెండు బిల్లులు సజీవంగా ఉన్నట్టే లెక్క. ఆ ప్రకారం ఆర్డినెన్స్ తీసుకురావడం కుదిరేపని కాదు.

ఆప్షన్ 3:
మండలిని రద్దు చేయడం. ఇవాళ(జనవరి 23,2020) నిర్వహించనున్న అసెంబ్లీ సమావేశాల్లో మండలి రద్దు తీర్మానం చేసి.. దాన్ని పార్లమెంటుకు పంపిస్తే.. పార్లమెంట్‌ కూడా ఆమోదిస్తే.. మండలి రద్దవుతుంది. ఐతే.. ఇది ఇప్పట్లో అయ్యే పని కాదు. అందుకు బీజేపీ కూడా జగన్‌కు మద్దతివ్వాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ జగన్‌కు మద్దతిస్తుందా అన్నది క్లిష్టతరమైన అంశమని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ మూడు ఆప్షన్లలో సెలక్ట్‌ కమిటీ రిపోర్ట్‌ వచ్చే వరకు వేచి చూడడం తప్ప జగన్‌ సర్కార్‌కు మరో మార్గం లేదు. ఐతే.. సెలక్ట్‌ కమిటీపై ఒత్తిడి తెచ్చి త్వరగా బిల్లులు అసెంబ్లీకి తీసుకొచ్చే అవకాశమైతే ఉంది. మరి జగన్‌ సర్కార్‌ ఏం చేస్తుందో వేచి చూడాలి.

* సీఎం జగన్‌ ముందు మూడు ఆప్షన్లు 
* సెలక్ట్‌ కమిటీ నివేదిక కోసం ఎదురుచూడాలి
* బిల్లు కమిటీకి పంపకుండా ఆర్డినెన్స్‌ తీసుకురావడం

* ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్డినెన్స్‌ తీసుకురావడం కష్టం
* మూడో ఆప్షన్‌ మండలిని రద్దు చేయడం 
* మండలి రద్దుకు పార్లమెంట్‌ ఆమోదం అవసరం

Also Read : సెలక్ట్ కమిటీ అంటే ఏమిటి? విధులు ఏంటి? : జగన్ కు లాభమా? నష్టమా?