ఏపీలో శాసన మండలి ఫ్యూచరేంటి?
ఏపీలో శాసన మండలి ఫ్యూచరేంటి? పెద్దల సభ రద్దయినట్టేనా? లేకపోతే యథావిధిగా కొనసాగుతుందా? బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీతో పాటు మండలి కూడా జరుగుతుందా?

ఏపీలో శాసన మండలి ఫ్యూచరేంటి? పెద్దల సభ రద్దయినట్టేనా? లేకపోతే యథావిధిగా కొనసాగుతుందా? బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీతో పాటు మండలి కూడా జరుగుతుందా?
ఏపీలో శాసన మండలి ఫ్యూచరేంటి? పెద్దల సభ రద్దయినట్టేనా? లేకపోతే యథావిధిగా కొనసాగుతుందా? బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీతో పాటు మండలి కూడా జరుగుతుందా? మండలి సమావేశాలు ఏర్పాటు చేయకపోతే ప్రతిపక్ష టీడీపీ న్యాయపోరాటం చేస్తుందా? అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్టీఏ రద్దు బిల్లుల విషయంలో మండలి ఛైర్మన్ వేసిన సెటెక్ట్ కమిటీ వ్యవహారం ఇంకా ఒక కొలిక్కి రాలేదు. ఇలాంటి పరిస్తితుల్లో ఎవరి వాదన వారు విన్పిస్తున్నారు. మండలి రద్దయినట్లే అని వైసిపీ భావిస్తోంది. మండలి అధికారికంగా రద్దు కాలేదని టీడీపీ అంటోంది.
గవర్నర్ కోర్టులో సెలెక్ట్ కమిటీ ఏర్పాటు వివాదం
సెలెక్ట్ కమిటీ ఏర్పాటు విషయంలో నెలకొన్న వివాదం గవర్నర్ కోర్టులో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మార్చిలో బడ్జెట్ సమావేశాలు జరుగనున్నాయి. ఈ సమావేశాల్లో ఒక్క శాసనసభను మాత్రమే నిర్వహిస్తారా.. మండలిని కూడా నిర్వహిస్తారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశం అయింది. అయితే అధికారికంగా మండలి రద్దు కాలేదు. కేవలం శాసనసభ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. దీని ప్రకారం మండలి ఇంకా ఉనికిలో ఉన్నట్లు అని టీడీపీ వాదిస్తోంది. మండలిని రద్దు చేసి.. తీర్మానాన్ని కేంద్రానికి పంపడంతో రద్దయినట్లే అని, దాన్ని ప్రత్యేకంగా సమావేశపవర్చాల్సిన అవసరం లేదని వైసీపీ భావిస్తోంది. అసెంబ్లీ నియమావళి ప్రకారం ప్రోరోగ్ ఆఫ్ ఈచ్ హౌస్.. కమెన్స్ ఆఫ్ ఈచ్ హౌస్ ఉన్నట్లు చెబుతున్నారు. దీని ప్రకారం ఏ సభకు ఆ సభను విడివిడిగా వాయిదా వేయవచ్చు. సమావేశపరచవచ్చు. ఈనేపథ్యంలో ప్రభుత్వం బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసనసభనే సమావేశపరచాలని కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సాధారణంగా బడ్జెట్ సమేశాల్లో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు.
మండలిని నిర్వహించొద్దన్న యోచనలో వైసీపీ
మండలి సమావేశాలు జరిగితే బడ్జెట్ బిల్లు మనీ బిల్లు కావడంతో మండలిలో కూడా వ్యతిరేకత ఉండదు. అయితే కేటాయింపులు, లోపాలపై మాత్రం మండలిలో బలంగా ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే అవకాశం ఉంది. అంతేకాకుండా సెలెక్ట్ కమిటీ వ్యవహారాన్ని కూడా తేల్చాలని పట్టుబట్టే అవకాశం ఉంది. బడ్జెట్ సమావేశాల సందర్బంగా అందివచ్చిన అవకాశాన్ని వినియోగించుకునేందుకు టీడీపీకి అవకాశం ఉంటుంది. అయితే టీడీపీ వాణి వినిపించకుండా చేయాలంటే మండలిని నిర్వహించకుండా ఉండటమే మంచిదనే భావనలో వైసీపీ ఉంది.
మండలి రద్దు విషయంలో సంచలనాత్మక నిర్ణయం తీసుకోనున్న వైసీపీ
కేవలం శాసనసభను మాత్రమే సమావేశ పరచమని గవర్నర్‌ను ప్రభుత్వంకోరిన పక్షంలో టీడీపీ కోర్టును ఆశ్రయించే అవకాశం ఉందంటున్నారు. కోర్టు తీర్పు వచ్చేలోగా సమావేశాలు ముగిసిపోతాయి. ఇప్పటికే మండలి రద్దు విషయంలో సంచలనాత్మక నిర్ణయం తీసుకోనున్న వైసీపీ… అదే దారిలో బడ్జెట్ సమావేశాలు కూడా దూకుడుగా వ్యవహరించేలా వ్యూహం రూపొందించుకుంది. అయితే మండలిని సమావేశపరచకుండా బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తే ఎలా ఎదుర్కోవాలి అనే యోచనలో టీడీపీ ఉంది. దీనిపై ఉభయ పార్టీలూ న్యాయపరమైన ఆటంకాలపై నిపుణుల సలహాలు తీసుకుంటున్నాయి.