అధికారంలోకి రాగానే బాబు అవినీతిపై విచారణ

జగన్ సంచలన నిర్ణయం ..బాబు అవినీతిపై విచారణ జరిపిస్తా

  • Published By: chvmurthy ,Published On : January 7, 2019 / 03:43 AM IST
అధికారంలోకి రాగానే బాబు అవినీతిపై విచారణ

జగన్ సంచలన నిర్ణయం ..బాబు అవినీతిపై విచారణ జరిపిస్తా

శ్రీకాకుళం: తాము అధికారంలోకి రాగానే  ఏపీలో చంద్రబాబు పాలనలో జరిగిన అవినీతిపై విచారణ జరిపిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగనమోహన్ రెడ్డి చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రజాసంకల్ప యాత్రలో ఉన్న ఆయన …ఆదివారం చంద్రబాబు నాయుడు అవినీతిపై రాసిన పుస్తకాన్ని విడుదల చేశారు. ఒక తెలుగు టీవీ చానల్ కిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ….తాము అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు పాల్పడిన అవినీతి భాగోతాన్నివెలికి తీస్తామని, జరిగిన కుంభకోణాలన్నిటిపైనా విచారణ జరిపిస్తామని అన్నారు. చంద్రబాబునాయుడు  చేసిన  అవినీతికి  చాలా ఆధారాలే ఉన్నాయని, వాటిని దర్యాప్తు సంస్దలకు అప్పగిస్తామని జగన్మోహన్ రెడ్డి తెలిపారు.
చంద్రబాబు నాయుడు అవినీతిమీద మేము సేకరించిన సమాచారాన్ని కోర్టుకు తీసుకుపోయి శిక్ష వేయించగలిగే ఆధారాలు ఉన్నాయన్నప్పుడు కొర్టుకు వెళతామనిజగన్ మోహన్ రెడ్డి చెప్పారు. అన్ని ఏజెన్సీల ద్వారా ప్రతి అంశంపైనా పూర్తి స్థాయిలో విచారణ జరిపించి, ఆధారాలు పూర్తిగా వచ్చిన తర్వాత కోర్టు బోన్‌లో నిలబెట్టే కార్యక్రమం కచ్చితంగా చేస్తాం అని ఆయన అన్నారు.