నారా Vs నార్నే నిజమేనా : లోకేష్ ను ఢీ కొట్టేది ఎవరు

లోకేష్.. సీఎం కొడుకు అయ్యి ఉండి అడ్డదారిలో మంత్రి అవుతారా అంటూ ప్రతిపక్షం దుమ్మెత్తిపోసింది. ఎవరెవరో ఏవేవో కామెంట్లు చేశారు. వీటన్నింటికీ చెక్ పెడుతూ.. నారా లోకేష్

  • Published By: veegamteam ,Published On : March 13, 2019 / 10:19 AM IST
నారా Vs నార్నే నిజమేనా : లోకేష్ ను ఢీ కొట్టేది ఎవరు

లోకేష్.. సీఎం కొడుకు అయ్యి ఉండి అడ్డదారిలో మంత్రి అవుతారా అంటూ ప్రతిపక్షం దుమ్మెత్తిపోసింది. ఎవరెవరో ఏవేవో కామెంట్లు చేశారు. వీటన్నింటికీ చెక్ పెడుతూ.. నారా లోకేష్

లోకేష్.. సీఎం కొడుకు అయ్యి ఉండి అడ్డదారిలో మంత్రి అవుతారా అంటూ ప్రతిపక్షం దుమ్మెత్తిపోసింది. ఎవరెవరో ఏవేవో కామెంట్లు చేశారు. వీటన్నింటికీ చెక్ పెడుతూ.. నారా లోకేష్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేశారు. ఏపీ రాజధాని ప్రాంతంలో కీలకం అయిన మంగళగిరి నుంచి పోటీకి రెడీ అయ్యారు. అక్కడ.. ఇక్కడ అంటూ వస్తున్న వార్తలకు చెక్ పెట్టి.. దమ్ముంటే రండి.. రాజధాని నుంచి బరిలోకి దిగుతున్నట్లు పార్టీ నుంచి క్లారిటీ ఇప్పించేశారు. దీంతో అసలు – సిసలు పోటీ అనేది ఇప్పుడే మొదలైంది. మంగళగిరి నుంచి లోకేష్ బరిలోకి దిగుతుంటే.. జగన్ ఎవర్ని దింపబోతున్నారు.. లోకేష్ ను ఢీకొట్టే లీడర్ ఎవరు అనేది ఆసక్తిగా మారింది.
Read Also : షాకింగ్ : దగ్గుబాటికి టికెట్ పై జగన్ డైలమా!

సిట్టింగ్ ఆళ్లకు డౌటే :
మంగళగిరిలో ప్రస్తుతం వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనకు సీటు డౌట్ అంటూ కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతుంది. ఇదే క్రమంలో జగన్ నిర్ణయమే ఫైనల్.. పోటీ చేయకపోయినా వినయంగానే ఉంటాను అంటూ ఎమ్మెల్యే ఆళ్ల ప్రకటించారు. ఇదంతా లోకేష్ బరిలోకి దిగకముందు.. ఇప్పుడు సీన్ మారిపోయింది. లోకేష్ దిగుతున్నాడు అని కన్ఫామ్ కావటంతో.. ఢీకొట్టే నేత వేటలో పడ్డారు జగన్. ఆళ్ల కంటే బెటర్ ఎవరనే వేటలో పడ్డారు. లోకేష్ పై పోటీకి రాజకీయంగా, ఆర్థికంగా బలంగా ఉన్న నేతను ఎంపిక చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కసితో ఉంది. ఈ స్థాయిలో వ్యూహాలు రచిస్తోంది.

లోకేష్ పై నార్నే పోటీ అంటూ ప్రచారం :
లోకేష్ పై పోటీకి.. జూనియర్ ఎన్టీఆర్ మామను రంగంలోకి దించితే బాగుంటుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కొందరు నేతలు సూచిస్తున్నారు. ఇదే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పోస్టులు చేస్తున్నారు. నారా వర్సెస్ నార్నే అయితే పోటీ రంజుగా ఉంటుందంటూ కామెంట్లు చేస్తున్నారు. అప్పుడే అసలు – సిసలు యుద్ధం జరుగుతుందని అంటున్నారు. ఎవరు గెలిచినా కిక్కు అయితే వస్తుందని అంటున్నారు. నార్నే శ్రీనివాసరావు.. జూనియర్ ఎన్టీఆర్ కు స్వయానా పిల్లను ఇచ్చిన మామ. సో.. జూనియర్ ఎన్టీఆర్ మద్దతు ప్రత్యక్షంగా కాకపోయినా.. పరోక్షంగా అయినా వస్తుందని.. ఇది ప్లస్ అవుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచనగా నేతలు ప్రచారం చేసేస్తున్నారు.

ఈ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. లోకేష్ పై పోటీ చేసే అభ్యర్థి ఎవరనేది 16వ తేదీన ప్రకటిస్తామని అంటోంది. సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న వార్తలకు సంబంధం లేదని.. అధికారికంగా ప్రకటించే వరకు నమ్మొద్దని చెబుతున్నారు ఆ పార్టీ నేతలు. అయినా.. నెటిజన్లు మాత్రం ఆగటం లేదు. నారా వర్సెస్ నార్నే అంటూ పెద్దఎత్తున కామెంట్స్ చేస్తున్నారు.
Read Also : ఇది కన్ఫామ్ : మంగళగిరి నుంచే లోకేష్ పోటీ