చంద్రబాబు సీఎం కాదు రియల్టర్ : అంబటి రాంబాబు

  • Published By: chvmurthy ,Published On : January 20, 2020 / 11:44 AM IST
చంద్రబాబు సీఎం కాదు రియల్టర్ : అంబటి రాంబాబు

Updated On : January 20, 2020 / 11:44 AM IST

రాష్ట్ర విభజన తర్వాత 2014 లో ప్రజలు మాజీ సీఎం అయిన చంద్రబాబు నాయుడు కి అధికారం ఇచ్చి రాజధానిని ఎంపిక చేయమని ఆయన భుజ స్కందాలపై పెడితే ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారిలా వ్యవహరించారని ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆరోపించారు. అందరికీ కావల్సిన రాజధాని, అందరికీ అందుబాటులో ఉండాల్సిన రాజధానిని ఏర్పాటు చేయాల్సింది పోయి అసలైన అమరావతిని నిర్లక్ష్యం చేసి..చెట్టుపేరు చెప్పి చంద్రబాబు కాయలమ్ముకున్నారని అంబటి అన్నారు. 

సోమవారం అసెంబ్లీలో రాజధాని పై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ  ఈ ప్రాంతంలో అటవీ భూమి 28 వేల ఎకరాలు ఉందని గుర్తించి కూడా ల్యాండ్ పూలింగ్ కు వెళ్లి రియల్ ఎస్టేట్ బిజినెస్ ఎందుకు చేశారని చంధ్రబాబును ప్రశ్నించారు. రాజధానిని ఏర్పాటు చేయమంటే రియల్టర్ అవతారం ఎత్తి స్కాం తో కూడిన రాజధానిని చేశారని అంబటి అన్నారు. అమరావతిలో  అన్నీ తాత్కాలిక కట్టడాలే నిర్మించారని… శాశ్వత కట్టడాలు కట్టలేదని అన్నారు. 

బాధ్యతా రాహిత్యంతో.. స్వలాభం కోసం.. వ్యాపార దృక్పధంతో…తన వాళ్లకు దోచి పెట్టాలనే సంకల్పంతో, బినామీలను  పెట్టుకుని  అమరావతి నిర్మాణం అనే దాన్ని చంద్రబాబు తీసుకువచ్చారని అంబటి వివరించారు. ఆంధ్రజ్యోతి, ఈనాడు ,చంద్రబాబు కలిసి ఒక కుట్ర పూరింతగా వ్యవహరిస్తున్నారని అంబటి అన్నారు. అమరావతి రాజధాని నిర్మాణానికి శివరామకృష్ణన్ కమిటీ చేసిన సూచనలను చంద్రబాబు తుంగలో తొక్కారని అంబటి చెప్పారు.

శివరామకృష్ణ కమిటీ చేసిన సిఫార్సుల్లో … పారిపాలన వికేంద్రీకరణతో కూడి ఉండాలని చెప్పారు  ఎక్కడైతే అసెంబ్లీ ,సెక్రటేరియట్ ఉంటాయో అక్కడే హై కోర్టు ఉండాల్సిన అవసరంలేదని చెప్పింది.. మూడు పంటలు పండే భూములను రాజధానికి తీసుకోవద్దని సూచించిందని …అయినా చంద్రబాబు  4వేల ఎకరాల భూమిని  బినామీల పేరుతో కొని,  ఇక్కడ వేల కోట్ల రూపాయలు సంపాదించాలనే దుష్టబుద్దితోనే ఇక్కడ రాజధాని ఏర్పాటచుచేశారని అంబటి ఆరోపించారు.