తెలంగాణలో ఒక్క రోజే 730 కేసులు..GHMCలో 659..

  • Published By: madhu ,Published On : June 22, 2020 / 12:36 AM IST
తెలంగాణలో ఒక్క రోజే 730 కేసులు..GHMCలో 659..

Updated On : June 22, 2020 / 12:36 AM IST

తెలంగాణలో కరోనా విశ్వరూపం చూపిస్తోంది. రోజు రోజుకు పాజిటివ్ కేసులు అధికమౌతున్నాయి. వందల సంఖ్యలో వైరస్ బారిన పడుతుండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ప్రధానంగా GHMCలో అధికంగా కేసులు నమోదవుతుండడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. 2020, జూన్ 21వ తేదీ ఆదివారం ఒక్క రోజే 730 కేసులు నమోదయ్యాయి. ఇందులో GHMCలోనే 659 మంది వైరస్ కు గురి కావడం గమనార్హం. జనగామలో 34 మందికి వైరస్ సోకింది. 

కరోనాతో ఏడుగురు చనిపోయారు. దీంతో మరణాల సంఖ్య 210కి పెరిగింది. ప్రస్తుతం 3 వేల 861 మంది చికిత్స పొందుతుండగా, 225 మంది డిశ్చార్జ్ అయ్యారు. మొత్తంగా కరోనా నుంచి కోలుకుని ఇంటికి చేరుకున్న వారి సంఖ్య 3 వేల 731కి చేరుకుంది. 

గ్రేటర్‌లో కరోనా వైరస్ ఆగడం లేదు. అంతకంతకూ పెరిగి..రికార్డుస్థాయిలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. ఎప్పుడు ఏ సమయంలో.. ఏ మూల నుంచి వైరస్‌ విరుచుకుపడుతుందో తెలియడం లేదు. దీంతో గ్రేటర్‌లో 15 ప్రత్యేక కరోనా నిర్ధారణ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.  కొండాపూర్‌ జిల్లా ఆసుపత్రి, వనస్థలిపురం, మహేశ్వరం, సరూర్‌నగర్‌, బాలాపూర్‌, కొండాపూర్‌ తదితర ప్రాంతాల్లో కరోనా నిర్ధారణ కేంద్రాలను ఏర్పాటు చేసి శాంపిల్స్‌ తీసుకుంటున్నారు.

జీహెచ్ఎంసీ 659
జనగామ 34
రంగారెడ్డి 10
మేడ్చల్ 09
ఆసిఫాబాద్ 03
వరంగల్ 03
వికారాబాద్ 02
సంగారెడ్డి 01
ఆదిలాబాద్ 01
భద్రాద్రి కొత్తగూడెం 01
నారాయణపేట 01
మెదక్ 01
నల్గొండ 01
యాదాద్రి భువనగిరి 01

Read: కరోనాకు హైదరాబాద్ ఇంజెక్షన్ రెడీ.. మార్కెట్ లోకి కోవిఫర్