Maha Kumbh Mela 2025 : 11 రోజుల్లో 11 కోట్ల మంది.. కుంభమేళాకు పోటెత్తిన భక్తులు..

144 ఏళ్ల తర్వాత గ్రహాల అరుదైన కలయిక ఏర్పడనున్న ఈ సందర్భానికి ప్రత్యేకత ఉండటంతో భారీ రద్దీ నెలకొనబోతోందని అధికారులు తెలిపారు.

Maha Kumbh Mela 2025 : 11 రోజుల్లో 11 కోట్ల మంది.. కుంభమేళాకు పోటెత్తిన భక్తులు..

Updated On : January 27, 2025 / 12:18 AM IST

Maha Kumbh Mela 2025 : ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో కుంభమేళా వైభవోపేతంగా జరుగుతోంది. ఈ మహాకుంభమేళాకు దేశవిదేశాల నుంచి భక్తులు పోటెత్తుతున్నారు. గంగ, యమున, సరస్వతి నదులు కలిసి త్రివేణి సంగమంలో పెద్ద ఎత్తున పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. నాగసాధవులు, ఇతర భక్తులు భారీగా తరలివస్తున్నారు.

Also Read : ఈ రెండు దిశలలో మొక్కలు ఎందుకు ఉంచకూడదో తెలుసా? వాస్తుశాస్త్రం ఏం చెబుతుందంటే?

ఆ ఒక్కరోజే 8 నుంచి 10 కోట్ల మంది అమృత స్నానం..!
మరోవైపు ఈ నెల 29న మౌని అమావాస్య కావడంతో అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తోంది యూపీ ప్రభుత్వం. ఆ ఒక్కరోజే దాదాపు 8 నుంచి 10 కోట్ల మంది భక్తులు అమృత స్నానం ఆచరించే అవకాశం ఉన్నందున 12 కిలోమీటర్ల పొడవైన ఘాట్ ని ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ట్రాఫిక్, జనం రద్దీని నియంత్రించేందుకు ప్రత్యేక సిబ్బందిని మోహరించామన్నారు.

 

నో వెహికల్, నో వీఐపీ జోన్..
144 ఏళ్ల తర్వాత గ్రహాల అరుదైన కలయిక ఏర్పడనున్న ఈ సందర్భానికి ప్రత్యేకత ఉండటంతో భారీ రద్దీ నెలకొనబోతోందని అధికారులు తెలిపారు. ఇక మౌని అమావాస్య రోజున వీఐపీ జోన్ ఉండదని, ప్రముఖులకు ప్రత్యేక ఏర్పాట్లు ఉండవని ప్రభుత్వం ఇప్పటికే తెలిపింది. ప్రయాగ్ రాజ్ లోకి వాహనాలను అనుమతించబోమని తెలిపింది. ప్రజల భద్రత దృష్ట్యా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు పేర్కొన్నారు.