తిరుమల భక్తులకు బిగ్ అలర్ట్.. వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు.. ఎప్పుడంటే..
ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం అప్రమత్తమైంది.

TTD Big Alert (Photo Credit : Google)
TTD Big Alert : ఈ నెల 16న తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు. భారీ వర్ష హెచ్చరికతో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. రేపు(అక్టోబర్ 15) తిరుమలలో సిఫార్సు లేఖలు స్వీకరించబోమమని అధికారులు తెలిపారు. భక్తులు సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. తిరుమల, తిరుపతిలోనూ రాబోయే రెండు రోజుల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం అప్రమత్తమైంది.
భక్తులు తిరుమలకు వచ్చి ఇబ్బంది పడకుండా రేపటి రోజున వీఐపీ బ్రేక్ దర్శనాలు, సిఫార్సు లేఖలు స్వీకరించేది లేదని స్పష్టం చేసింది. 16వ తేదీకి బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు. సాధారణంగా.. వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించి.. ఒకరోజు ముందుగానే సిఫార్సు లేఖలు స్వీకరిస్తారు. అంటే.. 16వ తేదీ వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించి.. 15వ తేదీన సిఫార్సు లేఖలను స్వీకరిస్తారు. అయితే, రేపు సిఫార్సు లేఖలను స్వీకరించబోమని టీటీడీ చెప్పింది. ఇందుకు భక్తులు సహకరించాలని కోరింది.
మరోవైపు.. తిరుమల, తిరుపతిలో భారీ వర్షాల కారణంగా భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా టీటీడీ అనేక జాగ్రత్తలు తీసుకుంది. ఇటు ఘాట్ రోడ్ లో కొండచరియలు విరిగిపడితే వెంటనే సహాయక చర్యలు చేపట్టేందుకు డిజాస్టర్ మేనేజ్ మెంట్ ఫోర్స్ ను కూడా రంగంలోకి దించింది. ఎక్కడైతే కొండచరియలు విరిగిపడతాయో అక్కడ జాగ్రత్తలు తీసుకుని, ఎప్పటికప్పుడు వాటిని తొలగించేందుకు డిజాస్టర్ మేనేజ్ మెంట్ ఫోర్స్ చర్యలు తీసుకోవాల్సిందిగా.. ఇవాళ జరిగిన సమీక్ష సమావేశంలో టీటీడీ ఈవో సూచించారు.
Also Read : మాది లంచాల ప్రభుత్వం కాదు: “పల్లె పండుగ”లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..