Tirumala : జూన్ 12న డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్యక్రమం

తిరుమల తిరుపతి దేవస్ధానం కార్యనిర్వహణాధికారి నిర్వహించే డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్య‌క్ర‌మం జూన్ 12వ తేదీ ఆదివారం తిరుమ‌ల అన్న‌మ‌య్య భవనంలో జరుగనుంది.

Tirumala : జూన్ 12న డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్యక్రమం

New Project (13)

Updated On : June 5, 2022 / 6:11 PM IST

Tirumala :  తిరుమల తిరుపతి దేవస్ధానం కార్యనిర్వహణాధికారి నిర్వహించే డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్య‌క్ర‌మం జూన్ 12వ తేదీ ఆదివారం తిరుమ‌ల అన్న‌మ‌య్య భవనంలో జరుగనుంది. ఉద‌యం 9 నుండి 10 గంట‌ల వ‌ర‌కు ఈ కార్య‌క్ర‌మం నిర్వహిస్తారు. ఈ కార్య‌క్ర‌మాన్ని శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి చాన‌ల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తుంది.

ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టీటీడీ కార్యనిర్వహణాధికారి శ్రీ ఎ.వి.ధ‌ర్మారెడ్డి గారితో  ఫోన్‌ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చు. ఇందుకు భక్తులు  నెంబరు 0877-2263261 కు ఫోన్ చేసి తమ అభిప్రాయాలు తెలిపి సందేహాలు తీర్చుకోవచ్చని టీటీడీ తెలిపింది.

Also Read : Amaravati : శ్రీ‌వారి ఆల‌య మ‌హాసంప్రోక్ష‌ణకు శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ‌