Uttarandhra : శ్రీ వరహాలక్ష్మీ నృసింహస్వామి పవిత్రోత్సవాలు

శ్రీ వరహాలక్ష్మీ నృసింహస్వామి... ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం. విశాఖపట్టణంలో ఉన్న ఈ ఆలయంలో పవిత్రోత్సవాలు జరుగనున్నాయి.

Uttarandhra : శ్రీ వరహాలక్ష్మీ నృసింహస్వామి పవిత్రోత్సవాలు

Uttarandhra

Updated On : September 17, 2021 / 8:26 AM IST

Sri Varaha Lakshmi Narasimha Swamy : శ్రీ వరహాలక్ష్మీ నృసింహస్వామి… ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం. విశాఖపట్టణంలో ఉన్న ఈ ఆలయంలో పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. ఇందుకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సంప్రదాయబద్ధంగా…ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అందులో భాగంగా…2021, సెప్టెంబర్ 16వ తేదీ గురువారం రాత్రి పుట్ట బంగారం తీసుకొచ్చి…పూజలు నిర్వహించిన అనంతరం అంకుర్పారణ చేశారు ఆలయ అర్చకులు. ఉత్సవాలను వైదికవర్గాలు ప్రారంభించారు.

Read More : Nexus Phone : ఐఫోన్‌-13పై గూగుల్‌ నెక్సస్‌ ట్రోలింగ్..!

మొత్తం ఐదు రోజుల పాటు ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ పవిత్రోత్సవాలు నిర్వహించేందుకు కారణం ఉంది. ఆలయంలో స్వామి వారికి సంవత్సరం పొడవునా..నిత్య కైంకర్యాలు, కళ్యాణం, ఇతర పూజలు నిర్వహిస్తుంటారనే సంగతి తెలిసిందే. అయితే…ఈ కార్యక్రమాల్లో భక్తులు, ఆలయ అర్చకులు, ఇతరులు తెలిసో, తెలియక జరిగిన పొరపొట్లు సమసిపోయేందుకు ఈ పవిత్రోత్సవాలను నిర్వహిస్తుంటారు.