ACC U19 Asia Cup 2023 : ఒకే రోజు భార‌త్‌, పాకిస్తాన్‌ల‌కు షాకిచ్చిన ప‌సికూన‌లు.. సెమీస్ నుంచే ఔట్‌..

దుబాయ్ వేదిక‌గా జ‌రుగుతున్న అండర్‌ 19 ఆసియా కప్‌లో ఒకే రోజు రెండు సంచ‌ల‌నాలు న‌మోదు అయ్యాయి.

ACC U19 Asia Cup 2023 : ఒకే రోజు భార‌త్‌, పాకిస్తాన్‌ల‌కు షాకిచ్చిన ప‌సికూన‌లు.. సెమీస్ నుంచే ఔట్‌..

ACC U19 Asia Cup 2023 India And Pakistan teams suffers defeat

Updated On : December 15, 2023 / 9:52 PM IST

దుబాయ్ వేదిక‌గా జ‌రుగుతున్న అండర్‌ 19 ఆసియా కప్‌లో ఒకే రోజు రెండు సంచ‌ల‌నాలు న‌మోదు అయ్యాయి. మాజీ ఛాంపియ‌న్లు అయిన భార‌త్, పాకిస్తాన్ జ‌ట్ల‌కు ప‌సికూన‌లు షాకిచ్చాయి. దీంతో భార‌త్, పాకిస్తాన్ జ‌ట్లు ఫైన‌ల్‌కు చేర‌కుండానే సెమీ ఫైన‌ల్‌లోనే ఇంటి ముఖం ప‌ట్టాయి. మొద‌టి సెమీ ఫైన‌ల్‌లో పాకిస్తాన్ కు యూఏఈ షాక్ ఇవ్వ‌గా రెండో సెమీ ఫైన‌ల్‌లో భార‌త్‌ను బంగ్లాదేశ్ ఓడించింది.

4 వికెట్ల తేడాతో భార‌త్‌..

బంగ్లాదేశ్‌తో జ‌రిగిన సెమీ ఫైన‌ల్ మ్యాచులో భార‌త్ 4 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన భార‌త్ 42.4 ఓవ‌ర్ల‌లో 188 ప‌రుగుల‌కు ఆలౌటైంది. మురుగన్‌ అభిషేక్‌ (62; 73 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) ముషీర్‌ ఖాన్‌ (50; 62 బంతుల్లో 3ఫోర్లు) హాఫ్ సెంచ‌రీల‌తో రాణించారు. మిగిలిన వారు విఫ‌లం కావ‌డంతో భార‌త్ ఓ మోస్త‌రు స్కోరుకే ప‌రిమిత‌మైంది. బంగ్లాదేశ్ బౌలర్లలో మరుఫ్‌ మృధ నాలుగు వికెట్లు ప‌డ‌గొట్టాడు.

రోహిత్ శ‌ర్మ‌కు బిగ్ షాక్‌.. ముంబై కెప్టెన్‌గా హార్దిక్ పాండ్య‌

అనంతరం ల‌క్ష్యాన్ని 42.5 ఓవర్లలో ఆరు వికెట్లు న‌ష్టపోయి బంగ్లాదేశ్ ఛేదించింది. బంగ్లా బ్యాట‌ర్ల‌లో అరిఫుల్‌ ఇస్లాం (94) ధాటిగా ఆడాడు. అహ్రర్‌ అమిన్‌ (44)లు రాణించాడు. భార‌త బౌల‌ర్ల‌లో నమన్‌ తివారీ మూడు వికెట్లు తీయ‌గా రాజ్‌ లింబానీ రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు.

11 ప‌రుగుల‌తో పాకిస్తాన్‌..

అంత‌క‌ముందు పాకిస్తాన్‌, యూఏఈ జ‌ట్ల మ‌ధ్య మొద‌టి సెమీ ఫైన‌ల్ మ్యాచ్ జ‌రిగింది. ఈ మ్యాచ్‌లో యూఏఈ మొద‌ట బ్యాటింగ్ చేసింది. 47.5 ఓవ‌ర్ల‌లో 193 ప‌రుగుల‌కు ఆలౌటైంది. యూఏఈ బ్యాట‌ర్ల‌లో ఆర్యన్‌ ఖాన్‌ (55), ఆర్యాన్ష్‌ శర్మ (46) లు రాణించారు. అనంత‌రం ల‌క్ష్య ఛేద‌న‌లో పాకిస్తాన్ 49.3 ఓవ‌ర్ల‌లలో 182 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. పాక్ బ్యాట‌ర్ల‌లో కెప్టెన్‌ సాద్‌ బేగ్‌ (50), అజాన్‌ అవైస్‌ (41) లు రాణించ‌గా మిగిలిన వారు విఫ‌లం కావ‌డంతో ఓట‌మి త‌ప్ప‌లేదు.

WI vs ENG 2nd T20 : సిక్స్ ఇలా కొట్టాల‌ని ఇన్ని రోజులు తెలియ‌దు భ‌య్యా..! వీడియో వైర‌ల్‌

కాగా.. భార‌త్‌, పాకిస్తాన్‌ల‌ను ఓడించిన బంగ్లాదేశ్‌, యూఏఈ జ‌ట్లు ఫైన‌ల్‌కు చేరుకున్నాయి. డిసెంబ‌ర్ 17 ఆదివారం ఫైన‌ల్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.

సంచలన విజయాలతో ఫైనల్‌ చేరిన బంగ్లాదేశ్‌, యూఏఈలు డిసెంబర్‌ 17న తుదిపోరులో ఢీకొననున్నాయి.