SunRisers Hyderabad: సన్‌రైజర్స్ హైదరాబాద్ నూతన కెప్టెన్‌గా ఐడెన్ మార్‌క్రమ్

సన్‌రైజర్ హైదరాబాద్ జట్టు కొత్త కెప్టెన్‌ను నియమించింది. దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ ఐడెన్ మార్‌క్రమ్‌ను కెప్టెన్‌గా నియమించింది. ఈ విషయాన్ని సన్ రైజర్స్ ట్విట్టర్ హ్యాండిల్లో పోస్టు చేసింది.

SunRisers Hyderabad: సన్‌రైజర్స్ హైదరాబాద్ నూతన కెప్టెన్‌గా ఐడెన్ మార్‌క్రమ్

SunRisers Hyderabad

Updated On : February 23, 2023 / 12:56 PM IST

SunRisers Hyderabad: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సందడి షురూ అయింది. టీంల వారిగా ఆటగాళ్ల ఎంపిక పూర్తికావటంతో పాటు, ఆయా టీంల యాజమాన్యాలు జట్టు కెప్టెన్లను ప్రకటిస్తున్నాయి. తాజాగా సన్‌రైజర్ హైదరాబాద్ జట్టు కొత్త కెప్టెన్‌ను నియమించింది. దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ ఐడెన్ మార్‌క్రమ్‌ను కెప్టెన్‌గా నియమించింది. ఈ విషయాన్ని సన్ రైజర్స్ ట్విట్టర్ హ్యాండిల్లో పోస్టు చేసింది. గత సీజన్‌లో జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ విలియమ్సన్ నుండి మార్‌క్రమ్ బాధ్యతలు స్వీకరించాడు.

Kane Williamson: న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అనూహ్య నిర్ణయం.. రంగంలోకి టిమ్ సౌథీ

ఈ నెల ప్రారంభంలో జరిగిన వేలంలో సన్ రైజర్స్ జట్టు ఐడెన్ మార్‌క్రమ్ ను కొనుగోలు చేసిన విషయం విధితే. అయితే, తొలుత ఇండియా ఆటగాడిని కెప్టెన్ నియమించేందుకు జట్టు యాజమాన్యం సిద్ధమైనట్లు వార్తలు వచ్చాయి. వీరిలో ముఖ్యంగా మయాంక్ అగర్వాల్ పేరు వినిపించింది. కానీ, చివరికి విదేశీ ఆటగాడికే సారథ్య పగ్గాలు అప్పగించింది.  దీంతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు తొమ్మిదో కెప్టెన్‌గా మార్‌క్రమ్ బాధ్యతలు చేపట్టనున్నాడు.

SunRisers Hyderabad: ఇది సన్‌రైజర్స్ వంతు.. కొవిడ్‌పై పోరాటానికి రూ.30కోట్ల విరాళం

సన్‌రైజర్స్ జట్టుకు కన్నేళ్లు పాటు డేవిడ్ వార్నర్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆ తరువాత కేన్ విలియమ్సన్ జట్టును నడిపించారు. ప్రస్తుత సీజన్‌లో ఆ ఇద్దరు జట్టులో చోటు దక్కించుకోలేదు. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు యాజమాన్యం నూతన కెప్టెన్ గా ఐడెన్ మార్‌క్రమ్ ను నియమించింది. మార్‌క్రమ్ దక్షిణాఫ్రికా ఆటగాడు ఐపీఎల్ 2022లో 47.63 సగటుతో మూడు అర్థసెంచరీలతో 381 పరుగులు చేశాడు. ఇదిలాఉంటే ఐపీఎల్ 16వ ఎడిషన్ మార్చి 31న ప్రారంభమవుతుంది. తొలి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ తన తొలి మ్యాచ్ ను ఏప్రిల్ 2న రాజస్థాన్ రాయల్స్ తో ఆడుతుంది.