AUS vs ENG : రెండు రోజుల్లో ముగిసిన నాలుగో టెస్టు.. మెల్‌బోర్న్ పిచ్‌కు ఐసీసీ ఏ రేటింగ్ ఇచ్చిందో తెలుసా?
యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇటీవల ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు మెల్‌బోర్న్ వేదికగా నాలుగో టెస్టు మ్యాచ్‌లో (AUS vs ENG) తలపడ్డాయి.
AUS vs ENG 4th Test ICC rated the pitch used in Melbourne
AUS vs ENG : యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇటీవల ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు మెల్‌బోర్న్ వేదికగా నాలుగో టెస్టు మ్యాచ్‌లో తలపడ్డాయి. ఈ మ్యాచ్ కేవలం రెండు రోజుల్లోనే ముగిసింది. పిచ్ విపరీతంగా బౌలర్లకు సహకరించింది. ఈ మ్యాచ్‌లో (AUS vs ENG) తొలి రోజు 20 వికెట్లు పడగా రెండో రోజు 16 వికెట్లు నేలకూలాయి. దీంతో పిచ్ పై అనేక విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో ఈ పిచ్ కు సోమవారం ఐసీసీ రేటింగ్ ఇచ్చింది. పిచ్ అసంతృప్తికరం అంటూ ఓ డీమెరిట్ పాయింట్‌ను కేటాయించింది.
‘మ్యాచ్ రిఫరీ జెఫ్ క్రోవ్ నివేదిక ఆధారంగా యాషెస్ నాలుగో టెస్టు కోసం వేదిక అయిన మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లోని పిచ్ కు అసంతృప్తికరం అని రేటింగ్ ఇస్తున్నాం. ఈ స్టేడియానికి ఓ డీమెరిట్ పాయింట్ ను చేర్చాం.’ అని ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది.
Abhishek Sharma : అభిషేక్.. ఆ కొట్టుకు ఏందీ సామీ.. 60 నిమిషాల్లో 45 సిక్సర్లు..
ఒక వేదికకు ఆరు డీమెరిట్ పాయింట్లు చేరితే.. ఆ వేదికపై 12 నెలల పాటు నిషేదం విధించబడుతుంది. ఆ సమయంలో ఎలాంటి అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆ స్టేడియంలో నిర్వహించడానికి వీలుండదు.
ఇదిలా ఉంటే.. ఐసీసీ పిచ్ రేటింగ్‌లో నాలుగు రకాల కేటగిరీలు ఉంటాయి. వెరీ గుడ్, సంతృప్తికరం, అసంతృప్తికరం, అన్‌ఫిట్ అనే కేటగిరీలు ఉంటాయి.
IND vs NZ : న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. హార్దిక్ తో పాటు ఆ స్టార్ ఆటగాడికి విశ్రాంతి!
Match referee Jeff Crowe hands down verdict on the MCG pitch used for the Boxing Day Test 👀#WTC27 | #AUSvENG
https://t.co/YdKIf8RBQu— ICC (@ICC) December 29, 2025
మెల్‌బోర్న్ మ్యాచ్‌లో కనీసం ఒక్క బ్యాటర్ కూడా అర్ధశతకాన్ని చేయలేదు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ గెలిచింది. ఇక ఇప్పటికే యాషెస్ సిరీస్ ఆసీస్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆసీస్ ఆధిక్యం 3-1గా ఉంది.
