అడిలైడ్ వన్డే: 4వ వికెట్ డౌన్

  • Published By: veegamteam ,Published On : January 15, 2019 / 05:34 AM IST
అడిలైడ్ వన్డే: 4వ వికెట్ డౌన్

Updated On : January 15, 2019 / 5:34 AM IST

అడిలైడ్ : ఆస్ట్రేలియా నాలుగో వికెట్ కోల్పోయింది. 27.2 ఓవర్‌లో 134 పరుగుల స్కోర్ వద్ద హ్యాండ్స్‌కాంబ్ ఔటయ్యాడు. హ్యాండ్స్‌కాంబ్ 20 రన్స్ చేశాడు. కాంబ్‌ను జడేజా పెవిలియన్ పంపించాడు. నిర్ణయాత్మకమైన రెండో వన్డేలో టాస్ గెల్చిన ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. 41 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. షమీ వేసిన ఎనిమిదో ఓవర్‌లో కారే(18) ధావన్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. అంతకుముందు ఓవర్‌లో కెప్టెన్‌ ఫించ్‌(6) భువనేశ్వర్‌ బౌలింగ్‌లో బౌల్డ్‌ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన షాన్‌ మార్ష్‌ హాఫ్ సెంచరీతో రాణించాడు. 62 బంతుల్లో 50 పరుగులు చేశాడు. వన్డే కెరీర్‌లో అతనికిది 14వ అర్ధ శతకం.

ఆస్ట్రేలియాపై టెస్ట్‌ సిరీస్‌ గెలిచిన ఉత్సాహంతో వన్డే సిరీస్‌కు బరిలోకి దిగిన భారత్‌కు తొలి మ్యాచ్‌లో అనూహ్య ఫలితం ఎదురైంది. భారత్‌తో పోలిస్తే అన్ని విభాగాల్లో అనుభవం తక్కువగా ఉన్న ఆసీస్‌ ముందు టీమ్ ఇండియా తలవంచింది. సిరీస్‌ కోల్పోకుండా ఉండాలంటే తప్పనిసరిగా ఈ మ్యాచ్‌లో టీమ్‌ ఇండియా గెలిచి తీరాలి. టెస్ట్‌ సిరీస్‌ విజయానికి తొలి అడుగు పడిన అడిలైడ్‌లో మరో గెలుపును అందుకోవాలని కోహ్లీసేన ఆశిస్తోంది. వన్డే సిరీస్‌ను గెలిచి తీరాలన్న పట్టుదలతో ఆసీస్‌ బరిలోకి దిగింది.