టీ20 : బంగ్లాదేశ్ టార్గెట్ 175 పరుగులు
సిరీస్ విజేత ఎవరో తేల్చే మూడో టీ 20లో టీమిండియా అదరగొట్టింది. భారీ స్కోర్ చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. 5 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్,

సిరీస్ విజేత ఎవరో తేల్చే మూడో టీ 20లో టీమిండియా అదరగొట్టింది. భారీ స్కోర్ చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. 5 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్,
సిరీస్ విజేత ఎవరో తేల్చే మూడో టీ 20లో టీమిండియా అదరగొట్టింది. భారీ స్కోర్ చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్(2, ధవన్(19) ఫెయిల్ అయినా.. కేఎల్ రాహుల్(35 బంతుల్లో 52 పరుగులు), శ్రేయస్ అయ్యర్(33 బంతుల్లో 62 పరుగులు)లు రాణించడంతో భారత జట్టు 174 పరుగులు చేయగలిగింది. చివర్లో మనీష్ పాండే కూడా చెలరేగి ఆడాడు. 13 బంతుల్లో 22 పరుగులు చేశాడు. దీంతో మొదట్లో భారత్ 150 పరుగులు కూడా చేయదనుకున్న భారత్.. చివరికి 5 వికెట్లు నష్టపోయి 174 పరుగులు చేయగలిగింది.
రోహిత్, ధవన్ విఫలం కావడంతో 35 పరుగులకే టీమిండియా ఓపెనర్లను కోల్పోయింది. ఈ దశలో బ్యాటింగ్ కు వచ్చిన శ్రేయస్ తో కలిసి రాహుల్ ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు. తొలుత నిదానంగా ఆడిన ఈ జోడీ తర్వాత బంగ్లా బౌలర్లపై చెలరేగింది. రాహుల్ స్ట్రోక్ ప్లే అదరగొట్టగా శ్రేయస్ సిక్సర్లతో చెలరేగాడు. పంత్ (6) మరోసారి నిరాశపరిచాడు. ఆఖర్లో మనీశ్ పాండే బ్యాట్ ఝుళిపించడంతో భారత్ 174 పరుగులు చేయగలిగింది. బంగ్లా బౌలర్లలో ఫఫియుల్, సౌమ్య సర్కార్ చెరో 2, అల్ అమిన్ ఒక వికెట్ తీశాడు.
175 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ ఆచితూచి ఆడుతోంది. ఈ మ్యాచ్‌లో ఎవరు గెలిస్తే వారే సిరీస్ గెలిచే అవకాశం ఉండటంతో.. మ్యాచ్‌పై ఉత్కంఠ నెలకొంది. బంగ్లా చరిత్ర సృష్టిస్తుందా.. లేదా భారత్ విజయ పరంపర కొనసాగుతుందా అనేది ఆసక్తిగా మారింది.