Rahul Dravid : టీమిండియా ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్.. మరో రెండేళ్ల కాంట్రాక్టు?

టీమ్ ఇండియా ప్రదాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్‌కు బీసీసీఐ మరో రెండేళ్ల కాంట్రాక్ట్‌ను ఆఫర్ చేసే అవకాశం ఉంది. ద్రవిడ్ కోచింగ్‌లో టీంఇండియా ప్రపంచ కప్ 2023 రెండింటిలోనూ రన్నరప్‌గా నిలిచింది....

Rahul Dravid : టీమిండియా ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్.. మరో రెండేళ్ల కాంట్రాక్టు?

Rahul Dravid

Rahul Dravid : టీమిండియాప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్‌కు బీసీసీఐ మరో రెండేళ్ల కాంట్రాక్ట్‌ను ఆఫర్ చేసే అవకాశం ఉంది. ద్రవిడ్ కోచింగ్‌లో టీమిండియా ODI ప్రపంచ కప్ 2023, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ రెండింటిలోనూ రన్నరప్‌గా నిలిచింది. అయితే ఐపీఎల్‌లో పలు ఆఫర్లు కూడా ఉన్నందున ద్రవిడ్ తన నిర్ణయాన్ని ఇంకా తెలియజేయలేదు. ప్రస్తుతానికి దక్షిణాఫ్రికా పర్యటనలో ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ జట్టుకు మార్గనిర్దేశం చేయాలని బీసీసీఐ పాలకమండలి కోరుతోంది.

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్, ODI ప్రపంచ కప్ రెండింటిలోనూ భారతదేశ జట్టును రన్నరప్‌గా ద్రవిడ్ నిలిపారు. కోచ్ గత రెండేళ్లలో మంచి రికార్డులు సాధించారు. ఇటీవల బీసీసీఐ కార్యదర్శి జేషా కూడా గత వారం కోచ్ ద్రవిడ్ తో చర్చలు జరిపినా, కాంట్రాక్టు వ్యవహారం తేలలేదు. ద్రవిడ్‌ను టెస్టు జట్టుతో కలిసి దక్షిణాఫ్రికాకు వెళ్లాలని బీసీసీఐ కోరుతోందని బీసీసీఐ సీనియర్ ఆఫీస్ బేరర్ ఒకరు చెప్పారు. ఒప్పందంపై సంతకం చేయకుండా పర్యటనకు వెళ్లడానికి ద్రవిడ్ సిద్ధంగా ఉంటాడా, లేదా అనేది ఇంకా తేలలేదు.

ALSO READ : Snake In Helmet : హెల్మెట్‌లో దూరిన నాగుపాము .. ఒళ్లు గగుర్పొడిచే వీడియో

రాహుల్ ద్రవిడ్ ను తమ జట్టు మెంటార్ గా ఉండాలని పలు ఐపీఎల్ ఫ్రాంచైజీలు కోరుతున్నాయి. ద్రవిడ్ పదవీకాలం పొడిగింపు వ్యవహారం ఆసక్తికరంగా మారింది. తదుపరి టీ20 ప్రపంచ కప్‌ను దృష్టిలో ఉంచుకుని ఒక సంవత్సరం పాటు ఉంటుందా లేదా 2025వ సంవత్సరం వరకు కోచ్ గా కొనసాగుతారా అనే అంశాలపై త్వరలో స్పష్టత రానుందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.

Also Read: కొన్నిసార్లు నిశబ్దమే ఉత్తమం..! బూమ్రా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ఎవరిని ఉద్దేశించి..? హార్దిక్ గురించేనా ..