Ben Stokes: అదృష్టం అంటే నీదే భ‌య్యా.. చేసింది 15 ప‌రుగులు.. రూ.16 కోట్లు ప‌ట్టుకెళ్తున్నావ్‌గా

ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ బెన్‌స్టోక్స్(Ben Stokes) స్వ‌దేశానికి వెళ్ల‌నున్నాడు. జూన్ 16న ఆస్ట్రేలియాతో ప్రారంభం కానున్న యాషెస్ సిరీస్ స‌న్న‌ద్ద‌త కోసం ఇంగ్లాండ్ బ‌య‌లుదేర‌నున్నాడు.

Ben Stokes: అదృష్టం అంటే నీదే భ‌య్యా.. చేసింది 15 ప‌రుగులు.. రూ.16 కోట్లు ప‌ట్టుకెళ్తున్నావ్‌గా

Ben Stokes

Updated On : May 20, 2023 / 9:32 PM IST

IPL 2023: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(IPL) 2023 సీజ‌న్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్(Chennai Super Kings) దూసుకుపోతుంది. శనివారం ఢిల్లీ క్యాపిట‌ల్స్‌((Delhi Capitals)తో జ‌రిగిన మ్యాచ్‌లో 77 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యం సాధించి ప్లే ఆఫ్స్‌కు చేరుకుంది. దీంతో చెన్నై అభిమానుల ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి. ఈ సంగ‌తి కాస్త ప‌క్క‌న బెడితే ఆ జ‌ట్టు స్టార్ ఆట‌గాడు, ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ బెన్‌స్టోక్స్(Ben Stokes) స్వ‌దేశానికి వెళ్ల‌నున్నాడు. జూన్ 16న ఆస్ట్రేలియాతో ప్రారంభం కానున్న యాషెస్ సిరీస్ స‌న్న‌ద్ద‌త కోసం ఇంగ్లాండ్ బ‌య‌లుదేర‌నున్నాడు.

వేలంలో స్టోక్స్‌ను చెన్నై సూప‌ర్ కింగ్స్ రూ.16.25 కోట్లు పెట్టి ద‌క్కించుకుంది. మొద‌టి రెండు మ్యాచ్‌లు ఆడిన స్టోక్స్ ఆ త‌రువాత మోకాలి గాయంతో ప‌లు మ్యాచ్‌ల‌కు దూరం అయ్యాడు. మ‌ళ్లీ అందుబాటులో వ‌చ్చిన‌ప్ప‌టికీ తుది జ‌ట్టులో మాత్రం చోటు ద‌క్క‌లేదు. ఈ సీజ‌న్‌లో రెండు మ్యాచ్‌లు ఆడిన స్టోక్స్ మొత్తంగా 15 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. ఒక్క ఓవ‌ర్ బౌలింగ్ చేసి 18 ప‌రుగులు స‌మ‌ర్పించుకున్నాడు.

DC vs CSK: ఢిల్లీ పై చెన్నై ఘ‌న విజ‌యం.. ప్లే ఆఫ్స్‌కు చేరిన ధోని సేన‌

చెన్నై ప్లే ఆఫ్స్‌కు చేరిన‌ప్ప‌టికి స్టోక్స్ అందుబాటులో ఉండ‌డం లేదు. యాషెస్ స‌న్న‌ద్ద‌లో భాగంగా జూన్ 1 నుంచి ఐర్లాండ్‌తో టెస్టు మ్యాచ్ ఆడేందుకు స్టోక్స్ స్వ‌దేశానికి ప‌య‌నం అవుతున్నాడు. దీంతో అత‌డిపై సోష‌ల్ మీడియాలో ట్రోల్స్ మొద‌లు అయ్యాయి. స్టోక్స్ ఐపీఎల్ ఆడ‌టానికి వ‌చ్చిన‌ట్లుగా లేదని, స‌మ్మ‌ర్ హాలిడేస్ కోసం వ‌చ్చాడ‌ని ఒక‌రు కామెంట్ చేయగా, అదృష్టం అంటే నీదే బాసూ.. ఒక్క ప‌రుగు చేస్తే కోటిపైనే ఇచ్చారుగా అంటూ య‌ట‌కారం చేస్తున్నారు.

అన్నేసి కోట్లు పెట్టి ఇలాంటి ఆట‌గాడిని కొనే బ‌దులు య‌శ‌స్వి జైస్వాల్‌, రింకూ సింగ్ వంటి యువ ఆట‌గాళ్ల‌ను వేలంలో ద‌క్కించుకున్నా చెన్నై ఎప్పుడో ప్లే ఆఫ్స్‌కు చేరి ఉండేద‌ని అంటున్నారు. ఇక‌పై అయినా ఇలాంటి ఆట‌గాళ్ల‌కు తీసుకోవ‌ద్ద‌ని చెన్నై మేనేజ్‌మెంట్‌ను కోరుకుంటున్నారు. ఎలాగో కోట్లు ఇస్తున్నారు గ‌దా ఆ ఇచ్చేది ఏదో రూ.2వేల నోట్లు ఇచ్చి పంపిస్తే బెట‌ర్ అంటూ ఫ‌న్నీగా కామెంట్లు పెడుతున్నారు.

IPL 2023: స‌న్‌రైజ‌ర్స్‌తో ఉమ్రాన్ మాలిక్ గొడ‌వ ప‌డ్డాడా..? అందుకే తుది జ‌ట్టులో స్థానం ద‌క్క‌డం లేదా..?