T20 Rankings : టీ20 ప్రపంచకప్ ముందు.. ర్యాంకింగ్స్‌లో టీమ్ఇండియా ఆటగాళ్ల దూకుడు
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ తాజాగా ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్‌లో (T20 Rankings) టీమ్ఇండియా ఆటగాళ్లు అదరగొట్టారు.
BOOST FOR INDIA VIA RANKINGS SHUFFLE ON EVE OF T20 WORLD CUP
T20 Rankings : అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ తాజాగా ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్‌లో టీమ్ఇండియా ఆటగాళ్లు అదరగొట్టారు. టీమ్ఇండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఏకంగా ఐదు స్థానాలను ఎగబాకాడు. కివీస్‌తో టీ20 సిరీస్‌లో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో (32, 82 నాటౌట్, 57 నాటౌట్ ) 171 పరుగులతో రాణించి 717 రేటింగ్ పాయింట్లతో ఏడో స్థానానికి చేరుకున్నాడు.
ఇక టీమ్ఇండియా యువ ఆటగాడు అభిషేక్ శర్మ 929 రేటింగ్ పాయింట్లతో తన అగ్రస్థానాన్ని మరింత సుస్ధిరం చేసుకున్నాడు. గాయం కారణంగా న్యూజిలాండ్‌తో సిరీస్‌కు దూరంగా ఉన్నప్పటికి కూడా తిలక్ వర్మ తన మూడో స్థానాన్ని కాపాడుకున్నాడు. ఇక భారత స్టార్ ఆటగాళ్లు హార్దిక్ పాండ్య 2 స్థానాలు మెరుగుపరచుకుని 53వ ర్యాంకు, శివమ్ దూబె 9స్థానాలను మెరుగుపర్చుకుని 58వ ర్యాంకు, రింకు సింగ్ 13 ర్యాంకులు ఎగబాకి 68వ స్థానానికి చేరుకున్నారు.
టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్-5 బ్యాటర్లు వీరే..
* అభిషేక్ శర్మ (భారత్) – 929 రేటింగ్ పాయింట్లు
* ఫిల్ సాల్ట్ (ఇంగ్లాండ్) – 849 రేటింగ్ పాయింట్లు
* తిలక్ వర్మ (భారత్) – 781 రేటింగ్ పాయింట్లు
* జోస్ బట్లర్ (ఇంగ్లాండ్) – 770 రేటింగ్ పాయింట్లు
* సాహిబ్జాదా ఫర్హాన్ (పాకిస్తాన్) – 763 రేటింగ్ పాయింట్లు
ఇక బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికి వస్తే.. భారత మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. వరుణ్ మినహా మరే భారత బౌలర్ కు టాప్-10లో లేడు. టీమ్ఇండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా నాలుగు స్తానాలు ఎగబాకి 13కు చేరుకున్నాడు. స్పిన్నర్ రవి బిష్ణోయ్ 13 స్థానాలు ఎగబాకి 19వ ర్యాంక్ కు చేరుకున్నాడు.
టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్-5 బౌలర్లు వీరే..
* వరుణ్ చక్రవర్తి (భారత్) – 787 రేటింగ్ పాయింట్లు
* రషీద్ ఖాన్ (అఫ్గానిస్తాన్) – 737 రేటింగ్ పాయింట్లు
* వనిందు హసరంగ (శ్రీలంక) – 702 రేటింగ్ పాయింట్లు
* జాకబ్ డఫీ (న్యూజిలాండ్) – 691 రేటింగ్ పాయింట్లు
* అబ్రార్ అహ్మద్ (పాకిస్తాన్) – 691 రేటింగ్ పాయింట్లు
