పాండ్యా, రాహుల్‌లతో పాటు కరణ్ జోహార్‌పైనా కేసు

పాండ్యా, రాహుల్‌లతో పాటు కరణ్ జోహార్‌పైనా కేసు

Updated On : February 6, 2019 / 5:11 AM IST

టీమిండియా క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్‌ల వివాదం ఇంకా ముగిసిపోలేదు. జోధ్‌పూర్‌లో ఈ సారి వీరిద్దరితో పాటు కరణ్ జోహార్‌పైనా కేసు నమోదైంది. డిసెంబర్ నెలలో ప్రసారితమైన కాఫీ విత్ కరన్ టీవీ కార్యాక్రమంలో పాండ్యా, రాహుల్‌లు మహిళల పట్ల అనుచితంగా మాట్లాడటంతో వారిని ఇటీవల కొన్ని మ్యాచ్‌లకు నిషేదించారు. 

నిషేద కాలం పూర్తి అయిన తర్వాత పాండ్యా న్యూజిలాండ్‌తో జరిగిన వన్డేల్లోనూ, రాహుల్ ఇండియా ఏ జట్టు తరపున ఇంగ్లాండ్ లయన్స్ జట్టుతో మ్యాచ్‌లు ఆడారు. అంబుడ్స‌మన్ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం.. సీఓఏ జనవరి 24వ తేదీ నిషేదాన్ని ఎత్తి వేసింది. అక్కడితో పూర్తి అయిపోయిన వివాదాన్ని ఈ బాలీవుడ్ డైరక్టర్ కరణ్ జోహార్ తన టీఆర్పీ రేటింగ్‌ల కోసం మరోసారి లేవనెత్తాడు. 

‘ఈ ఘటనకు పూర్తిగా నేనే బాధ్యుడిని. వారిని అతిథులుగా నేనే ఆహ్వానించాను. నా షోకి వచ్చిన ప్రతి ఒక్కరినీ ఆడవాళ్ల గురించి తమ అభిప్రాయాలను అడిగాను. దీపికా పదుకొణే, అలియా భట్‌లతో సహా అభిప్రాయాలు తీసుకున్నాను. ఏదైతే జరిగిందో అది వాళ్ల జీవితాల మీద ప్రభావం చూపుతుందని అనుకోలేదు. ఇది నా ప్లాట్ ఫాం కాబట్టి నేనే క్షమాపణ కోరుతున్నాను. కానీ, వారిద్దరూ ఇప్పటికే శిక్ష అనుభవించారు’ అని పేర్కొన్నాడు.