ఢిల్లీ డమాల్.. ఫైనల్‌కు చెన్నై
క్వాలిపయర్ 2మ్యాచ్‌లో చెన్నై రెచ్చిపోయింది. ఢిల్లీ నిర్దేశించిన లక్ష్యాన్ని అలవోకగా చేధించగలిగింది. ఓపెనర్లు షేన్ వాట్సన్, డుప్లెసిస్ హాఫ్ సెంచరీలతో విజయాన్ని చేరువ చేశారు.

క్వాలిపయర్ 2మ్యాచ్‌లో చెన్నై రెచ్చిపోయింది. ఢిల్లీ నిర్దేశించిన లక్ష్యాన్ని అలవోకగా చేధించగలిగింది. ఓపెనర్లు షేన్ వాట్సన్, డుప్లెసిస్ హాఫ్ సెంచరీలతో విజయాన్ని చేరువ చేశారు.
క్వాలిపయర్ 2మ్యాచ్‌లో చెన్నై రెచ్చిపోయింది. ఢిల్లీ నిర్దేశించిన లక్ష్యాన్ని అలవోకగా చేధించగలిగింది. ఓపెనర్లు షేన్ వాట్సన్, డుప్లెసిస్ హాఫ్ సెంచరీలతో విజయాన్ని చేరువ చేశారు. డుప్లెసిస్(50; 39బంతుల్లో 7ఫోర్లు, 1సిక్సు), వాట్సన్(50; 32బంతుల్లో 3ఫోర్లు, 4సిక్సులు)తో అద్భుతమైన ఇన్నింగ్స్ కనబరిచారు.
సగానికి పైగా ఆటను ఓపెనర్లు పూర్తి చేసేస్తే మిగిలిన బ్యాట్స్‌మెన్ 48 పరుగుల లక్ష్యాన్ని చేరుకున్నారు. సురేశ్ రైనా(11) పటేల్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. రాయుడు(20)తో కలిసి కాసేపటి వరకూ క్రీజులో కనిపించిన ధోనీ(9) ఇషాంత్ బౌలింగ్ లో పాల్ క్యాచ్ పట్టడంతో అవుట్ అయ్యాడు. బ్రావో(10)క్రీజులోకి వచ్చి రావడంతోనే ఆల్ రౌండర్ ప్రదర్శనతో మిగిలి ఉన్న లాంచనాన్ని పూర్తి చేశాడు. ఢిల్లీ బౌలర్లు బౌల్ట్, ఇషాంత్ శర్మ, అక్సర్ పటేల్, అమిత్ మిశ్రా తలో వికెట్ తీయగలిగారు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ తడబాటుకు గురైంది. ఆరంభం నుంచి ఒత్తిడి పెంచినా ఢిల్లీ క్యాపిటల్స్ 9వికట్లు నష్టపోయి చెన్నైకు 148పరుగుల టార్గెట్ ఇచ్చింది. మరోసారి ఇన్నింగ్స్ మొత్తం పంత్ చుట్టూ తిరిగింది. ఫలితంగా స్వల్ప విరామంతోనే వికెట్లు కోల్పోతూ వచ్చింది. ఫైనల్‌కు వెళ్లాలనే ఉద్దేశ్యంతో ధోనీ వ్యూహాలతో చెన్నై బౌలర్లు 9వికెట్లు పడగొట్టారు. దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, హర్భజన్ సింగ్, రవీంద్ర జడేజా, డేన్ బ్రావో తలో 2వికెట్లు పడగొట్టగా ఇమ్రాన్ తాహిర్‌కు ఒక వికెట్ మాత్రమే దక్కింది.
గత మ్యాచ్‌లో మెరుపులు కురిపించిన పృథ్వీ షా(5)ఆరంభంలోనే పెవిలియన్ చేరాడు. మరో ఓపెనర్ శిఖర్ ధావన్(18) సైతం 5.2ఓవర్లకే భజ్జీ బౌలింగ్‌లో ధోనీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత కాసేపటి వరకూ పోరాడిన కొలిన్ మన్రో(27; 24బంతుల్లో 4ఫోర్లు) చేయగలిగాడు. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్(13)తడబడటంతో 75 పరుగుల వద్ద అవుటయ్యాడు.
ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యతలు భుజాన వేసుకున్న పంత్ చివరి వరకూ నిలబటి(38; 25బంతుల్లో 2ఫోర్లు, 1సిక్సు)చేయగలిగాడు. ధోనీ వ్యూహం ప్రకారం పంత్‌ను టార్గెట్ చేసినట్లుగా కనిపించింది. నాన్ స్ట్రైకింగ్‌లో ఎండ్‌లోనే ఉంచుతూ మరో వైపు వికెట్లు కొల్లగొట్టారు. అక్సర్ పటేల్(3), రూథర్ ఫర్డ్(10), కీమో పాల్(3), అమిత్ మిశ్రా(6), ట్రెంట్ బౌల్ట్(6)స్కోరు చేయగా ఆఖర్లో వచ్చిన ఇషాంత్ శర్మ రెండు బంతుల్లో 2బౌండరీలు బాది 147పరుగులతో ఇన్నింగ్స్ ముగించాడు.