900 టీ20 సిక్సులతో రికార్డు సృష్టించిన క్రిస్ గేల్

విధ్వంసకర ఆటగాడు వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం క్రిస్ గేల్ మరో అరుదైన ఘనత సాధించాడు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో 25వ మ్యాచ్ ఆడుతుండటమే కాకుండా ఇదే ఫార్మాట్‌లో 900 సిక్సులు పూర్తి చేశాడు. 40 బంతుల్లో 55 పరుగులు బాదిన క్రిస్ గేల్ జట్టు ఆరు వికెట్ల తేడాతో గెలుపొందడంలో కీలకంగా వ్యవహరించాడు. ఈ ఒక్క మ్యాచ్‌లోనే ఐదు సిక్సులు కొట్టిన గేల్ మరో రికార్డు సృష్టించాడు. ఈ రికార్డుతో ఫార్టా ఫార్మాట్ టీ20లో 900సిక్సులు బాదిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు. మొత్తం 363 టీ20లు ఆడిన గేల్ 355 ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్ చేశాడు.
ఈ ఫార్మాట్‌లో 12,189 పరుగులు చేస్తే అందులో కేవలం 5,400పరుగులు సిక్సుల ద్వారా వచ్చినవే. 3720 పరుగులు మాత్రం ఫోర్ బౌండరీల ద్వారా సాధించాడు. దీనిని బట్టే తెలుస్తోంది అతని స్కోరులో 75%వరకూ బౌండరీలు బాదే దక్కించుకున్నాడు. ఈ వరుసలో గేల్ తర్వాత కీరన్ పొలార్డ్ ఉన్నాడు. అతని టీ 20 కెరీర్‌లో 557 సిక్సులు కొట్టినా గేల్ రికార్డు చేరుకోవడానికి వందల పరుగుల దూరంలో ఉన్నాడు.
ఇంకా టీ 20 ఫార్మాట్‌లో అత్యధిక సిక్సులు చేసిన వారి జాబితాలో బ్రెండన్ మెక్ కల్లమ్ (484), షేన్ వాట్సన్(386), స్టీవ్ స్మిత్(372), డేవిడ్ వార్నర్ (328), రోహిత్ శర్మ (322), ఆరోన్ ఫించ్(320)లు ఉండగా ఆండ్రీ రస్సెల్, డివిలియర్స్ (319)సిక్సులతో నిలిచారు.