పేదలకు రూ.50 లక్షల విలువైన బియ్యం ఇచ్చిన సౌరవ్ గంగూలీ

  • Published By: veegamteam ,Published On : March 26, 2020 / 06:17 AM IST
పేదలకు రూ.50 లక్షల విలువైన బియ్యం ఇచ్చిన సౌరవ్ గంగూలీ

Updated On : March 26, 2020 / 6:17 AM IST

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తిని తగ్గించే ప్రయత్నంలో 1.3 బిలియన్ల జనాభా ఉన్న భారత దేశం మెుత్తం మార్చి 25, 2020 నుంచి   ప్రభుత్వం 21 రోజుల లాక్ డౌన్ విధించింది. ఈ లాక్ డౌన్ కారణంగా నిరుపేదలకు సహయం చేసేందుకు బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ రూ.50 లక్షల రైస్ ని విరాళంగా ఇచ్చారు.

గంగౌలీ మాట్లాడుతూ రైస్ తో పాటు, భద్రత కోసం ప్రభుత్వ పాఠశాలల్లో ఉంటున్న నిరుపేదలకు  కూడా సదుపాయం కల్పిస్తున్నట్లు క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ ఒక ప్రకటనలో తెలిపింది. 

బిసిసిఐ అధ్యక్షుడు గంగూలీ చేసిన పనితో రాష్ట్రంలోని ఇతర పౌరులకు ఆదర్శంగా తీసుకుని ఇలాంటి కార్యక్రమాలు చేయమని ప్రోత్సాహిస్తుందని ఆశిస్తున్నాం అని సంస్ధ తెలిపింది.

భారతదేశంలో రోజు రోజు కేసులు సంఖ్య పెరిగిపోతుంది. ప్రస్తుతం 664 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశ వ్యాప్తంగా 14 మంది మరణించారు. 

Also Read | నాన్నా.. కరోనా వస్తది బయటకెళ్లొద్దు: గుండెలు పిండేసే వీడియో