CSKvRR: చెన్నై ఉత్కంఠభరిత విజయం

రాజస్థాన్ వేదికగా జరిగిన పోరులో చెన్నై ప్లేయర్లు విజృంభించారు. ఆఖరి ఓవర్లలో ఉత్కంఠభరితంగా సాగిన పోరులో చెన్నై బ్యాట్స్ మెన్ అద్భుతమైన విజయం అందుకుంది. టార్గెట్ చేరుకునేందుకు బంతులు తక్కువగా ఉన్నా.. సూపర్ కింగ్స్ తడబడలేదు. ఆఖరి బంతివరకూ విజయం దక్కించుకోవడానికి ఇరుజట్లు తీవ్రంగా పోరాడాయి. అంబటి రాయుడు..(57; 47బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సులు), ఎంఎస్ ధోనీ(58; 43 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సులు)తో మ్యాచ్ ను తిప్పేశారు.
మిగిలిన బ్యాట్స్ మెన్ షేన్ వాట్సన్(0), డుప్లెసిస్(7), సురేశ్ రైనా(4), కేదర్ జాదవ్(1), రవీంద్ర జడేజా(9), మిచెల్ శాంతర్(10) లు లక్ష్య చేధనలో భాగమైయ్యారు. రాజస్థాన్ బౌలర్లు ధావల్ కుల్ కర్ణి, జయదేవ్ ఉనదక్త్, జోఫ్రా ఆర్చర్ లు తలో వికెట్ తీయగా, బెన్ స్టోక్స్ 2 వికెట్లు పడగొట్టారు.
టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ 7వికెట్లు పడగొట్టి 151 పరుగులకు కట్టడి చేయగలిగారు. క్రీజులో నిలదొక్కుకునేందుకు తీవ్రంగా శ్రమించిన రాజస్థాన్ బ్యాట్స్‌మెన్ ఒక్కరు కూడా 30కి మించిన స్కోరు నమోదు చేయలేకపోయారు.
సొంతగడ్డపైనే పరుగులు చేసేందుకు తడబడిన రాజస్థాన్‌ను చూసి క్రీడాభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఓపెనర్లుగా దిగిన రహానె(14), బట్లర్(23)మాత్రమే చేశారు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన వారెవ్వరూ నిలబడలేకపోయారు. సంజూ శాంసన్(6), స్టీవ్ స్మిత్(15), రాహుల్ త్రిపాఠీ(10), బెన్ స్టోక్స్(28), రియాన్ పరాగ్(16), జోఫ్రా ఆర్చర్(13), శ్రేయాస్ గోపాల్(19)పరుగులు మాత్రమే చేయగలిగారు.
చెన్నై బౌలర్లలో దీపక్ చాహర్ మరో సారి సత్తా చాటి 2వికెట్లు పడగొట్టగా.. శార్దూల్ ఠాకూర్(2), రవీంద్ర జడేజా(2), మిచెల్ శాంతర్(1) తీయగలిగారు.