జీవిత కాల నిషేదం: జట్టులోకి తీసుకోలేదని సెలక్టర్‌పై దాడి

ఆటగాడైనా, పోటుగాడైనా దూకుడుని పనిలో చూపించాలి. పై అధికారులపై కాదు. అలా ఆవేశానికి పోతే అనర్థం జరిగేది మనకే. తాజాగా జరిగిన ఈ ఘటనలో బలైపోయాడు ఢిల్లీ క్రికెటర్. ఢిల్లీ అండ్ డిస్టిక్స్ క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ) సీనియర్ సెలక్షన్ కమిటీకి ఛైర్మన్‌పై అండర్ 23క్రికెటర్ అనూజ్ దేడా దాడికి యత్నించాడు. న్యూ ఢిల్లీలోని కశ్మీరీ గేట్‌లో సెయింట్ స్టీఫెన్ గ్రౌండ్ వేదికగా అండర్-23రాష్ట్ర స్థాయి జట్టు కోసం ఎంపికలు జరుగుతున్నాయి.
వాటికి అనూజ్ దేడాను అనుమతించలేదు. ఆగ్రహానికి గురైన ఆ ప్లేయర్ ఇనుప రాడ్లు, హాకీ స్టిక్‌లు తీసుకుని సెలక్టర్‌పై దాడి చేశాడు. దాంతో తీవ్రగాయాలకు గురైన సెలక్టర్‌ను కో సెలక్టర్ సుఖ్వీందర్ సింగ్ ఆసుపత్రి సహాయంతో ఆసుపత్రికి తీసుకెళ్లారు.
డీడీసీఏ ఛీఫ్ రజత్ శర్మ మాట్లాడుతూ.. ‘సెలక్టర్ అమిత్ బండారీపై ఫిజికల్‌గా దాడికి పాల్పడ్డారు. ఇందుకుగానూ ఆ ప్లేయర్‌పై జీవిత కాల నిషేదం విధించాం. క్రికెట్‌లో ఎలాంటి టోర్నీలోనూ ఆడేందుకు అవకాశాల్లేకుండా కోల్పోయాడు’ అని వెల్లడించాడు.