IND vs AUS : ఆస్ట్రేలియాతో రెండో టెస్టు.. రోహిత్ ఆ స్థానంలోనే బ్యాటింగ్‌కు రావాలి..
ఆస్ట్రేలియాతో పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో ఘన విజయం సాధించి మంచి జోష్‌లో ఉంది టీమ్ఇండియా.

Devang Gandhi Suggests Middle Order Role for Rohit in Adelaide Test
ఆస్ట్రేలియాతో పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో ఘన విజయం సాధించి మంచి జోష్‌లో ఉంది టీమ్ఇండియా. వ్యక్తిగత కారణాలతో తొలి టెస్టుకు రోహిత్ శర్మ దూరం కాగా గాయం కారణంగా శుభ్‌మన్ గిల్ సైతం ఆడలేదు. ఇక వీరిద్దరు అడిలైడ్ వేదికగా డిసెంబర్ 6 నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్టు మ్యాచ్‌లో ఆడనున్నారు. అయితే.. టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పుడు ఏ స్థానంలో బరిలోకి దిగుతాడు అన్నది చర్చనీయాంశంగా మారింది.
రోహిత్ గైర్హాజరీలో కేఎల్ రాహుల్ తొలి టెస్టు మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ మంచి ప్రదర్శన కనబరిచాడు. ఇక ఆస్ట్రేలియా ప్రైమ్‌మినిస్టర్ ఎలెవన్‌తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లోనూ రాహుల్ ఓపెనర్‌గానే వచ్చాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ నాలుగో స్థానంలో బరిలోకి దిగాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మ బ్యాటింగ్ స్థానంపై మాజీ సెలెక్టర్ దేవాంగ్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ప్రస్తుత ఓపెనింగ్ స్థానాలను మార్చవద్దని సూచించాడు. కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్‌లు ఓపెనర్లుగానే రావాలని సూచించాడు. కెప్టెన్ రోహిత్ శర్మ ఆరో స్థానంలో రావాలన్నాడు. ఐదో స్థానంలో రిషబ్ పంత్ అద్భుతంగా ఆడుతున్నాడని, అందుకనే హిట్‌మ్యాన్ ఆరులో రావాలన్నాడు. అప్పుడు రైట్, లెఫ్ట్ కాంబినేషన్ అవుతుందన్నాడు. వాస్తవానికి మిడిల్ ఆర్డర్‌లో ఆడే వారు ఓపెనింగ్ చేయడం కష్టమని, అయితే.. ఓపెనర్లు మిడిల్ ఆర్డర్ లో ఆడడం చాలా ఈజీ అని చెప్పాడు.
ఇక కెరీర్ ఆరంభంలో రోహిత్ మిడిల్ ఆర్డర్‌లో ఆడిన విషయాన్ని గుర్తు చేశాడు. అందుకనే రోహిత్ మిడిల్ ఆర్డర్‌లో ఆడితే జట్టుకు ప్రమోజనం అని అన్నాడు.