యాక్సిడెంట్ లో మహిళా క్రికెటర్ మృతి

దక్షిణాఫ్రికా జట్టు మాజీ మహిళా క్రికెటర్ ఎల్రిసా థెనిస్సేన్ ఫోరీ(25) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. నార్త్ వెస్ట్ ప్రాంతంలో జరిగిన యాక్సిడెంట్ లో క్రికెటర్ ఆమె కూతురితో సహా మృతి చెందినట్లు దక్షిణాఫ్రికా క్రికెట్ నిర్దారించింది. క్రికెట్ సౌతాఫ్రికా ఎగ్జిక్యూటివ్ తబంగ్ మోరె ఎల్రిసా తన కుటుంబ సభ్యులకు సంతాపాన్ని తెలియజేశారు.
‘ఎల్రిసా జాతీయ క్రికెట్ కు సేవలందించారు. ఇలా జరగడం ఆమె కుటుంబ సభ్యులను, స్నేహితులతో పాటు సహోద్యుగులను విచారంలో పడేసింది. ఆమె భర్త రూడీకి నా సంతాపాన్ని తెలుపుతున్నా’ అని పేర్కొన్నారు. ఎల్రిసా దక్షిణాఫ్రికా జట్టులో 3 వన్డేలు, ఒక టీ20 మ్యాచ్ ఆడారు. 2013వ సంవత్సరం లంక జట్టు ప్రత్యర్థిగా దక్షిణాఫ్రికా ఆడుతున్న మ్యాచ్ లో అరంగ్రేటం చేశారు.
దీంతో పాటు కొన్ని దేశీవాలీ లీగ్ లలో కూడా ఆడి మెప్పించారు. కొన్ని స్థానిక లీగ్ లకు కోచ్ గా కూడా వ్యవహరించారు. గర్భిణీగా ఉన్న సమయంలో లీగ్ లన్నింటి నుంచి సెలవు తీసుకుని ఆటకు దూరంగా ఉన్నారు.