కరోనా ఎఫెక్ట్…ఫిఫా అండర్ 17 మహిళల వరల్డ్ కప్ వాయిదా వేసిన భారత్

కరోనా వైరస్ దృష్యా భారతదేశంలో నవంబర్ లో జరగాల్సి ఉన్న FIFA అండర్-17 ఉమెన్స్ వరల్డ్ కప్ వాయివా పడింది. నవంబర్-2నుంచి 21వరకు దేశంలోని ఐదు ప్రదేశాలు(కోల్ కతా,గౌహతి,భువనేశ్వర్,అహ్మదాబాద్,నవీ ముంబై)లో జరుగవలసి ఉన్న ఫిఫా అండర్-17 ఉమెన్స్ వరల్డ్ కప్ ను వాయిదా వేస్తున్నట్లు ఫుట్ బాల్ గవర్నంగ్ బాడీ.. ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫుట్ బాల్ అసోసియేషన్స్ తెలిపింది.
కరోనా కారణంగా ఇప్పటికే జాపాన్ లో జరుగాల్సిన ఒలింపిక్స్-2020 కూడా ఏడాది పాటు వాయిదా పడిన విషయం తెలిసిందే. కరోనా దృష్యా ఏటా భారత్ లో పండుగలా నిర్వహించబడే ఐపీఎల్ కూడా రద్దు అయిన విషయం తెలిసిందే. ఒక్క భారత్,జపాన్ లో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వివిధ క్రీడా సంబురాలు వాయిదా పడ్డాయి,మరికొన్ని రద్దు అయ్యాయి.