టీమిండియా ప్రధాన కోచ్‌గా గౌతమ్ గంభీర్.. ఫైనల్ చేసిన బీసీసీఐ?

టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ వారసుడుగా ఎవరనే విషయంపై గత కొద్దిరోజుల నుంచి ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటికే ఆసక్తిఉన్న వారి నుంచి బీసీసీఐ దరఖాస్తులు స్వీకరించింది.

టీమిండియా ప్రధాన కోచ్‌గా గౌతమ్ గంభీర్.. ఫైనల్ చేసిన బీసీసీఐ?

Gautam Gambhir (Credit _Google)

Updated On : June 1, 2024 / 1:05 PM IST

Teamindia Head Coach Gautam Gambhir : టీమిండియా పురుషుల జట్టు ప్రధాన కోచ్ గా గౌతమ్ గంభీర్ ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. రాహుల్ ద్రవిడ్ వారసుడిగా గంభీర్ సరిగ్గా సరిపోతాడని బీసీసీఐ భావిస్తున్నట్లు, ఆ మేరకు గంభీర్ పేరును ఫైనల్ చేసినట్లు సమాచారం. అయితే, ఇటీవల కాలంలో టీమిండియా ప్రధాన కోచ్ రేసులో తానులేనని గంభీర్ చెప్పిన విషయం తెలిసిందే. ప్రస్తుతం గంభీర్ తన మనస్సు మార్చుకొని ప్రధాన కోచ్ గా బాధ్యతలు తీసుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీంతో త్వరలోనే టీమిండియా ప్రధాన కోచ్ గా గౌతమ్ గంభీర్ పేరును బీసీసీఐ అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.

Also Read : TATA IPL 2024 : ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో 62 కోట్లకుపైగా వ్యూస్‌తో జియోసినిమా సరికొత్త రికార్డు..!

టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ వారసుడుగా ఎవరనే విషయంపై గత కొద్దిరోజుల నుంచి ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటికే ఆసక్తిఉన్న వారి నుంచి బీసీసీఐ దరఖాస్తులు స్వీకరించింది. ఈ పదవికి గంభీర్, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు స్టీఫెన్ ప్లెమింగ్, ఆండీ ప్లవర్ వంటివారి పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ, అందరికంటే గంభీర్ అయితేనే మెరుగైన ఆప్షన్ అని బీసీసీఐ వర్గాలు భావిస్తున్నాయి. ఐపీఎల్ 2024లో కేకేఆర్ జట్టు ట్రోపీని గెలుచుకోవటం, ఆ జట్టుకు మెంటర్ గాఉన్న గంభీర్ పాత్ర ట్రోపీ గెలవడంలో కీలకంగా ఉండటం అందరికీ తెలిసిన విషయమే. కేకేఆర్ ట్రోపీని కైవసం చేసుకున్న తరువాత బీసీసీఐ సెక్రటరీ జేషాతో గంభీర్ సుదీర్ఘంగా చర్చించారు. అయితే, వీరి మధ్య ఎలాంటి చర్చ జరిగిందనే విషయం వారెవరూ బయటకు చెప్పనప్పటికీ.. టీమిండియా హెడ్ కోచ్ పదవి విషయంపైనే వారి మధ్య చర్చజరిగినట్లు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి.

Also Read : Virat Kohli : ఎట్ట‌కేల‌కు అమెరికా విమానం ఎక్కిన కోహ్లి.. బంగ్లాదేశ్‌తో మ్యాచ్ ఆడ‌తాడా?

ఇండియా టుడే ఇచ్చిన ఓ నివేదిక ప్రకారం.. ద్రావిడ్ స్థానంలో టీమిండియా ప్రధాన కోచ్ గా గంభీర్ దాదాపు నియమితులయ్యారని పేర్కొంది. గంభీర్ కు జాతీయ జట్టు, ఐపీఎల్ జట్టుకు ప్రధాన కోచ్ గా పనిచేసిన అనుభవం లేనప్పటికీ.. ఈ ఏడాది ఐపీఎల్ లో కేకేఆర్ జట్టు ట్రోపీని గెలుచుకోవడంలో గంభీర్ సమర్ధవంతమైన పాత్రను పోషించారు. దీంతో బీసీసీఐ గంభీర్ పేరును ద్రవిడ్ వారసుడిగా మొదటి ఆప్షన్ గా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే గంభీర్ పేరును అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.