‘షూ లేస్ కట్టుకోవడం తెలియనోళ్లు ధోనీ గురించి మాట్లాడతారా’

రాబోయే టీ20 టోర్నమెంట్‌లో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని దూరంగా ఉంచడంతో రిటైర్మెంట్‌పై సందేహాలు పెరిగిపోయాయి. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ జరుగుతున్నప్పటికీ వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్ట్ కప్‌పైనే సందేహాలు మొదలయ్యాయి.
ఈ క్రమంలో టీ20 వరల్డ్ కప్ కు ధోనీ ఉంటాడా లేదా అనే ప్రశ్నలపై రవిశాస్త్రి స్పందించాడు. ‘ధోనీ గురించి కామెంట్ చేసేవారిలో సగం షూ లేస్ కట్టుకోవడం రానివాళ్లే. ధోనీ దేశానికి ఎంత సంపాదించాడో చూడండి. అతని రిటైర్మెంట్‌కు ఎందుకంత ఆతురత పడుతున్నారు. మాట్లాడుకోవడానికి ఏమీ లేనట్లుంది’
‘ఎలాగూ ధోనీ రిటైర్ అవ్వాల్సిందే. దీని గురించి చౌక బారు స్టేట్‌మెంట్లు ఇచ్చి అవమానిస్తున్నారు. భారత్ కు 15సంవత్సరాల పాటు ఆడి సేవలందించిన ధోనీకి ఏం చేయాలో తెలీదా. టెస్టు క్రికెట్ కు వీడ్కోలు చెప్పేటప్పుడు వృద్ధిమాన్ సాహా కీపింగ్ సరిపోతాడని చెప్పి తప్పుకున్నాడు. భారత జట్టుకు నీడలా.. తన ఆలోచనను ఎప్పుడూ పంచుకుంటూనే ఉన్నాడు’
‘రాంచీలో జరిగిన టెస్టు మ్యాచ్ కు వచ్చి షెబాజ్ నదీమ్ కు ప్రోత్సాహం కలిగేలా మాట్లాడాడు. సొంత మైదానంలో ఓ యువ క్రికెటర్ కు చెప్పిన మాటలు ఎంతో విలువైనవి. ధోనీ తానెప్పుడు రిటైర్ అవ్వాలనుకుంటున్నాడో ఆ హక్కు ఉంది. ఇక్కడితో ఈ చర్చ ముగించండి’ అని రవిశాస్త్రి వివరించాడు.