Hardik Pandya : ముంబై జట్టులోకి హార్దిక్ పాండ్యా..! సోషల్ మీడియాలో మీమ్స్ తో హల్ చల్ చేస్తున్న నెటిజన్లు

ఐపీఎల్ 2024 సీజన్ కు ముందు హార్ధిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబై ఇండియన్స్ కు మారాడు. గత రెండు సీజన్లలో గుజరాత్ టైటాన్స్ కు కెప్టెన్ గా వ్యవహరించిన హార్దిక్..

Hardik Pandya : ముంబై జట్టులోకి హార్దిక్ పాండ్యా..! సోషల్ మీడియాలో మీమ్స్ తో హల్ చల్ చేస్తున్న నెటిజన్లు

Hardik Pandya

Updated On : November 27, 2023 / 12:39 PM IST

IPL 2024 : ఐపీఎల్ 2024 సీజన్ కు ముందు హార్ధిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబై ఇండియన్స్ కు మారినట్లు తెలుస్తోంది. గత రెండు సీజన్లలో గుజరాత్ టైటాన్స్ కు కెప్టెన్ గా వ్యవహరించిన హార్దిక్.. 2022లో జట్టును విజేతగా నిలిపాడు. 2023లో గుజరాత్ టైటాన్స్ ఫైనల్ కు చేరింది. అయితే, వచ్చే సీజన్ కోసం తిరిగి ముంబై జట్టులోకి హార్దిక్ పాండ్యా చేరబోతున్నాడు. ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. హార్ధిక్ పాండ్యా విషయంలో ఇరు జట్ల మధ్య ఒప్పందం కుదిరిందని, హార్దిక్ కు ఇచ్చే వార్షిక జీతం కాకుండా గుజరాత్ కు భారీ మొత్తం చెల్లించేందుకు ముంబయి సిద్ధమైందని బీసీసీఐ, ఐపీఎల్ విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. కానీ, అది ఎంత మొత్తమో మాత్రం వెల్లడి కాలేదు. ఎంత ఇచ్చినా అందులో 50శాతం హార్డిక్ కు దక్కుతుంది.

Also Read : CSK : ఐపీఎల్ 2024 ఆడ‌నున్న ధోనీ.. చెన్నై సూప‌ర్ కింగ్స్ విడుద‌ల చేసిన‌, అట్టిపెట్టుకున్న ఆట‌గాళ్ల లిస్ట్ ఇదే..

నాటకీయ పరిణామాల మధ్య హార్దిక్ పాండ్య పాత గూటికి (ముంబై జట్టు) చేరినట్లు తెలుస్తోంది. ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్ ను కైవసం చేసుకున్న ముంబై ఇండియన్స్ ఆటగాళ్లను రిటెన్షన్ తర్వాత తమ ఖాతాలో రూ. 15.25 కోట్లను మాత్రమే కలిగి ఉంది. దీంతో పాండ్యా ను జట్టులోకి తీసుకొనేందుకు తొలుత అవకాశం లేకుండా పోయింది. కానీ, ముంబై ఇండియన్స్ ఆ జట్టులోని ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్ (రూ. 17.5కోట్లు చెల్లించి కొనుగోలు చేసింది) వదులుకుంది. కెమెరాన్ గ్రీన్ ను బెంగళూరుకు ముంబయి ఇచ్చేసిందని తెలిసింది. అయితే, హార్ధిక్, గ్రీన్ జట్టు మార్పునకు బీసీసీఐ పచ్చజెండా ఊపినప్పటికీ అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు.

Also Read : Ravichandran Ashwin : ముంబై జట్టులోకి హార్ధిక్ పాండ్యా? అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు.. జట్టు ఎలా ఉంటుందో చెప్పేశాడు.

హార్ధిక్ పాండ్యాను ముంబై కొనుగోలు చేస్తుందని, అందుకు గుజరాత్ టైటాన్స్ జట్టు యాజమాన్యం అంగీకారం తెలిపిందని వార్తలు వచ్చాయి. ఆటగాళ్లను వదులుకునేందుకు ఆదివారం సాయంత్రం వరకే సమయం ఉడటంతో చివరి కొద్ది గంటల్లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆదివారం సాయంత్రం 5.25 గంటలకు హార్ధిక్ పాండ్యాను గుజరాత్ టైటాన్స్ జట్టు యాజమాన్యం తమవద్దే ఉంటాడని తెలిపింది. రాత్రి 7.25 సమయంలో హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ జట్టులోకి వచ్చేస్తున్నాడని ప్రకటన వెలువడినట్లు వార్తలు వచ్చాయి. అయితే, హార్ధిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ జట్టులో చేరికపై క్లారిటీ మాత్రం రాలేదు. ఇరు జట్లు ఈ అంశంపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. దీంతో నెటిజన్లు సోషల్ మీడియాలో మీమ్స్ తో చెలరేగిపోతున్నారు.